BigTV English

Joe Root Record: రోహిత్ రికార్డుని దాటేసిన జో రూట్.. సచిన్ రికార్డు కూడా ?

Joe Root Record: రోహిత్ రికార్డుని దాటేసిన జో రూట్.. సచిన్ రికార్డు కూడా ?

Joe Root Breaks Rohit Record: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా మా తర్వాతే.. అని ఒక సినిమా హీరో అన్నట్టు.. క్రికెట్ లో రికార్డులు సృష్టించాలంటే మనవాళ్ల తర్వాతేనని అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులు ఇద్దరు టాప్ ఇండియన్ క్రికెటర్లు సచిన్, కొహ్లీ చేతిలో ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. వాటిని ఇంగ్లీషు బ్యాటర్ జో రూట్ దాటేసేలా ఉన్నాడని నిపుణులు అంటున్నారు.


ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, 33 ఏళ్ల జో రూట్.. శతకాల మీద శతకాలు చేస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసి.. తన కెరీర్ లో 33 సెంచరీలతో ముందడుగు వేశాడు. అంతేకాదు నాలుగేళ్లలో 16 సెంచరీలు చేసి.. మరో రికార్డ్ బద్దలు కొట్టాడు. ఇకపోతే ఓవరాల్ గా రోహిత్ శర్మ సెంచరీలు (48)ను అధిగమించాడు.

అయితే జో రూట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలతో దూసుకువెళుతున్నాడు. అయితే ఈ సెంచరీని రూట్ తన మాజీ బ్యాటింగ్ మెంటార్, స్నేహితుడు గ్రాహమ్ థోర్ప్‌కు అంకితం చేశాడు. ఎందుకంటే ఇదే నెలలో తను మరణించాడు.


Also Read: మసూద్ వర్సెస్ ఆఫ్రిది: పాక్ జట్టులో ఢిష్యుం ఢిష్యుం

ఇకపోతే టెస్ట్ క్రికెట్ లో ఇంతవరకు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) ఉన్నాడు. అయితే ఇప్పటికి జో రూట్ (33) టెస్టు సెంచరీల్లో ముగ్గురు టాప్ క్రికెటర్లను అధిగమించాడు. వారిలో స్టీవ్ స్మిత్ (32), కేన్ విలియమ్సన్ (32), స్టీవ్ వా (32)ల‌ు ఉన్నారు. ఇక సర్ అలిస్టర్ కుక్ (33) తో సమానంగా నిలిచాడు. మరో సెంచరీ చేస్తే తనని దాటేస్తాడు.

ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ను కూడా టీ 20, వన్డే మ్యాచ్ తరహాలో ఆడేందుకు ప్రయత్నిస్తోంది. అలా దానికి బజ్ బాల్ క్రికెట్ అని కూడా నామకరణం చేసింది. ఆ దిశగా విజయాలు కూడా సాధిస్తోంది. ఎటాకింగ్ ప్లే తో ముందడుగు వేస్తోంది.

మొదట్లో ఈ తరహా ఆట ఆడేందుకు ఇబ్బంది పడ్డ జో రూట్.. తర్వాత అందుకున్నాడు. చకచకా పరుగులు చేస్తూ నాలుగేళ్లలో 16 సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ తో ఉండి, ఒకొక్క రికార్డు బూజు దులుపుతున్నాడు.

Also Read:  విరాట్ కొహ్లీకే.. ప్రకాష్ రాజ్ కౌంటర్!

అయితే కొహ్లీ (29) కూడా జో రూట్ వెనుకే ఉన్నాడు. ఎందుకంటే టీమ్ ఇండియా త్వరలో 10 టెస్టు మ్యాచ్ ల వరకు ఆడనుంది. ఇందులో కనీసం 5 సెంచరీలు విరాట్ చేసినా జో రూట్ ని దాటేసే అవకాశాలున్నాయి. 33 ఏళ్ల జో రూట్ ఇంకా నాలుగేళ్లు క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం జో రూట్ 145 టెస్టు మ్యాచ్ లు ఆడితే, సచిన్ 200 టెస్టు మ్యాచ్ లు ఆడటం విశేషం. సచిన్ చేసిన పరుగులు, టెస్టుల్లో సెంచరీల రికార్డుని జో రూట్ దాటాలంటే మాత్రం మరో 40 టెస్ట్ మ్యాచ్ లైన ఆడాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇంగ్లండు జట్టు 40 టెస్టులు ఆడాలంటే, కనీసం 5 నుంచి 6 ఏళ్లు పడుతుంది. అంతవరకు మరి జో రూట్ రిటైర్ అవకుండా ఉంటాడా? లేదా?అనేది వేచి చూడాల్సిందే. అలాగే ఓవరాల్ గా కొహ్లీ చేసిన 80 సెంచరీలు, సచిన్ చేసిన 100 సెంచరీలను అందుకోవడం జో రూట్ కి.. సాధ్యం కాదని అంటున్నారు. మరి భారతీయుల రికార్డులు బద్దలు కొడతాడేమో చూడాలని అభిమానులు అంటున్నారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×