BigTV English

Jr Ntr: తాత సాంగ్‌ని మ‌రోసారి రీమిక్స్ చేస్తున్న ఎన్టీఆర్‌

Jr Ntr: తాత సాంగ్‌ని మ‌రోసారి రీమిక్స్ చేస్తున్న ఎన్టీఆర్‌

Jr Ntr:యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ NTR 30పై ఇప్పుడు అంద‌రి దృష్టి నెల‌కొంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. RRR త‌ర్వాత తార‌క్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ. ఆచార్య వంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఆయ‌న ఎన్టీఆర్ 30ని ఎలా తెర‌కెక్కించ‌బోతున్నార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. RRR విడుద‌లై ఏడాది కావ‌స్తున్న ఎన్టీఆర్ 30 మూవీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. అందుకు కార‌ణం.. NTR 30ని పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియెన్స్ మెచ్చేలా ప్ర‌తీ విష‌యంలో ఎంతో కేర్ తీసుకుని అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా రూపొందించ‌టానికి అడుగులు వేస్తున్నారు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే సీనియ‌ర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం వేట‌గాడు. ఆ సినిమాతో ఆప‌టు ఆకు చాటు పిందె త‌డిసె అనే సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సాంగ్‌ను ఇంత‌కు ముందు అల్ల‌రి రాముడు సినిమా కోసం రీమిక్స్ చేశారు. అయితే మ‌రోసారి అదే సాంగ్‌ను రీమిక్స్ చేయ‌టానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ రెడీ అయ్యారని స‌మాచారం. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

లాస్ ఏంజిల్స్ నుంచి ఎన్టీఆర్ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత మార్చి 18న NTR 30 షూటింగ్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రెండు, మూడు రోజుల్లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోతార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.


Samantha: హమ్మయ్య సమంత ఎంట్రీ ఇచ్చేసింది.. రౌడీ స్టార్ ‘ఖుషి’

Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×