Big Stories

Flu: దగ్గు, జలుబు, జ్వరం.. ఇవే కారణం.. డాక్టర్లు ఏమంటున్నారంటే..

Flu: దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కేసులు. మనకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. ఒకరు ఇద్దరు అని కాదు.. కొన్ని వారాలుగా దేశమంతా ఇదే తీరు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు ఫుల్ బిజీ. మళ్లీ కరోనా కాలం నాటి ఆందోళన కనిపిస్తోంది. సడెన్‌గా ఈ రోగాలేంటి? ఫ్లూ వైరస్ విజృంభణకు రీజనేంటి? ఇవన్నీ హెచ్‌3ఎన్‌2 కేసులేనా?

- Advertisement -

ప్రస్తుత ‘ఫ్లూ’ సీజన్‌కు వాతావరణ మార్పులే కారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఎండ వేడి వేగంగా పెరుగుతోంది. సమ్మర్ మొదలైపోయింది. అయినా.. తెల్లవారుజామున చలి ఉంటోంది. ఉష్ణోగ్రతల్లో ఈ భారీ వ్యత్యాసం వల్లే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్టు చెబుతున్నారు. ఈ డిఫరెంట్ వెదర్ వల్లే.. పొడిదగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయని అంటున్నారు.

- Advertisement -

జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు నాలుగు రోజుల్లో తగ్గుతున్నప్పటికీ.. దగ్గు మాత్రం ఓ పట్టాన తగ్గడం లేదు. కొందరికి వారం పడుతుంటే.. ఇంకొందరికి నెలైనా దగ్గు తగ్గడం లేదు. గతంలో ఇలాంటి వాతావరణంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యేవి. ఈ సారి మాత్రం హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, బాధితుల నమూనాలు ల్యాబ్‌కి పంపిస్తే.. హెచ్‌3ఎన్‌2 కేసులు తక్కువనే తెలుస్తున్నాయి. ఇదంతా సాధారణ ఫ్లూ వైరస్ ప్రభావమనే అంటున్నారు వైద్యులు. అలానే చికిత్స చేస్తున్నారు.

ఇక ప్రైవేటు ఆసుపత్రులు పండగ చేసుకుంటున్నాయి. ఏదో ఒక సమస్యతో హాస్పిటల్‌కి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రభుత్వ దవాఖానాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రైవేటుకు వెళితే.. టెస్టులు, మందులు, ఫీజులు, ట్రీట్మెంట్ పేరుతో పీల్చిపిప్పి చేస్తున్నారు. హాస్పిటల్ భయానికి కొందరు ఇంట్లోనే తమకు తెలిసిన మందులు వాడేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఫ్లూ కు ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్ వాడొద్దని ఐసీఎమ్ఆర్ కూడా ప్రకటించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బాధితులు చల్లటి నీరు తాగరాదు.
ఎండల్లో ఎక్కువగా తిరగకూడదు.
బయటకెళితే గొడుగు వాడితే బెటర్.
మాస్కులు, శానిటైజర్‌ వాడాలి.
లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News