Jr.NTR: కొన్ని కొన్ని పాత్రలు కొంతమంది హీరోలకు పూర్తిగా సెట్ అయిపోతాయి. అంతేకాదు ఆ పాత్ర గుర్తొచ్చిందంటే ఆ హీరో పేరే గుర్తొస్తుంది. అంతలా ఆ పాత్రలలో ఒదిగిపోయారు. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) సినిమాను సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) చేద్దామనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ (Krishan) ఆ చిత్రంలో నటించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. కృష్ణ గురించి మాట్లాడాల్సి వస్తే అల్లూరి పాత్ర గుర్తుకొస్తుంది.
బాబాయ్ మూవీ ఆడియో లాంఛ్ లో అబ్బాయ్..
అలాగే కొమరం భీమ్ (Komaram Bheem) పాత్ర గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్రను చాలామంది చేయాలని ప్రయత్నించారు. అందులోనూ కొమరం భీమ్ పై కొన్ని సినిమాలు వచ్చినా ఊహించినంత స్థాయిలో లభించలేదు. అయితే రాజమౌళి(Rajamouli) ఆర్ఆర్ఆర్ (RRR )చిత్రంలో అల్లూరి, కొమరం భీం పాత్రలతో ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కొమరం భీమ్ అనగానే ఇప్పుడు ఎన్టీఆర్ (Jr.NTR)గుర్తుకొస్తారు. వాస్తవానికి గతంలో చాలామంది హీరోలకు ఈ పాత్రలో నటించడానికి ప్రపోజల్స్ వెళ్లాయట. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. దాసరి నారాయణరావు, బాలకృష్ణ కాంబినేషన్లో ‘పరమవీరచక్ర’ (Paramaveerachakra) అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా ఆడియో లాంచ్ చాలా గ్రాండ్గా నిర్వహించగా, ఆ కార్యక్రమానికి బాలచందర్(Balachandar )ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బాబాయ్ ని కొమరం భీం పాత్రలో చూడాలి..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు. ఆడియో లాంచ్ జరిగిన తర్వాత ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్యను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు గారు పరమవీరచక్ర సినిమాలో రావణాసురుడిగా చూపించారు. బాబాయ్ ను అలా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. భగవంతుడు మరో 10 కళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే కొమరం భీమ్ గెటప్ లో కూడా బాబాయ్ ని చూడాలనుకుంటున్నాము. అర్జెంట్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘కొమరం భీమ్’ సినిమా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ బహిరంగంగానే తన బాబాయ్ అలాంటి పాత్రలు చేయాలని కోరుకున్నారు ఎన్టీఆర్.
అబ్బాయ్ చేసి చూపించాడుగా..
అయితే ఆ కోరిక నెరవేరలేదు. కానీ ఆ కొమరం భీం పాత్రలో నటించాలని బాలయ్యని రిక్వెస్ట్ చేసిన ఆయనకు అవకాశం లభించలేదు. కానీ చివరికి జూనియర్ ఎన్టీఆర్ తానే పూర్తిస్థాయిలో కొమరం భీం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ భీమ్ పాత్రలో నటించి అలరించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని వారు ఉండరు. ఆ విధంగా తన బాబాయ్ ను కొమరం భీం పాత్రలో నటించమని రిక్వెస్ట్ చేశారు ఎన్టీఆర్. కానీ ఆయనే చివరికి ఆ పని పూర్తి చేయడం గమనార్హం. అంతలా ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న బాబాయ్ – అబ్బాయ్ మధ్య మాటలు నేడు లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.