trinayani serial today Episode: విక్రాంత్ దగ్గరకు వచ్చిన సుమనకు వదినను ఓ కంట కనిపెట్టమని దగ్గర నుంచి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో పరిశీలించమని విక్రాంత్ చెప్తాడు. దీంతో సుమన భయపడిపోతుంది. అలా దగ్గరకు వెళ్లి నేనేదో చూస్తున్నాను.. చేస్తున్నాను అని అక్కకు అనుమానం వస్తే నన్ను వాయించేస్తుంది బుల్లిబావగారు అంటూ చెప్పగానే విక్రాంత్ అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గార్డెన్ లో కూర్చున్న నేత్రి పూలను తదేకంగా చూస్తుంటుంది. ఇంతలో అక్కడికి విశాల్ వస్తాడు. పువ్వులు తల్లో పెట్టుకోకుండా ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు.
పెళ్లి తర్వాత భర్త చేతితో పూలు పెట్టించుకుంటే అబ్బో అలా ఊహించుకుంటేనే సిగ్గుగా ఉంది బాబుగారు అంటుంది నేత్రి. విశాల్ బాధతో నయని అసలు నీకు ఏమైంది ఎందుకు పెళ్లి కాలేదు అంటున్నావు అని అడుగుతాడు. అసలు నాకు పెళ్లి అయిందని ఎవరు చెప్పారు బాబుగారు మీకు. మీరు కూడా నమ్ముతున్నారా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో సరే నీకు పెళ్లి కాలేదు అనుకుందాం. నాకు పెళ్లి అయిందంటే నమ్ముతావా అంటూ విశాల్ అడగ్గానే మీకు పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలని ఇంట్లో అందరూ చెప్తే అప్పుడు నవ్వు రాలేదు కానీ ఇప్పుడొస్తుంది బాబుగారు అంటుంది నేత్రి. దీంతో విశాల్.. నయని నాకు నిజంగా పెళ్లి అయింది అని చెప్తాడు. అవునా ఎవర్ని చేసుకున్నారు బాబుగారు అని నేత్రి అడుగుతుంది.
విశాల్ తన పెళ్లి గురించి చెప్తూ.. నేను పెళ్లి చేసుకుంది నయనిని. పూర్తి పేరు త్రినయని ఊరు ముక్కంటి పురం. వాళ్లమ్మ పేరు శ్యామల. వాళ్ల చెల్లి సుమన. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అని విశాల్ అడుగుతాడు. అసలు నేను పెళ్లి చేసుకుంది నిన్నే నయని అంటూ విశాల్ చెప్పగానే అవన్నీ నాకు తెలియదు బాబుగారు నేను మాత్రం వచ్చింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అని కరాకండిగా చెప్తుంది నేత్రి. దీంతో అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్. నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్తారు. నువ్వు నయని కాదు త్రినేత్రి అని నీకు చెప్పింది ఎవరు వాటికైనా సమాధానం చెప్పు అంటూ విశాల్ అడుగుతాడు.
వల్లభ ఆలోచిస్తూ తిలొత్తమ్మ దగ్గరకు వెళ్తాడు. ఇద్దరూ కలసి నేత్రి గురించి ఆలోచిస్తుంటారు. టాబ్లెట్స్ ఇస్తే విసిరి కొట్టింది. సుమనను లాగిపెట్టి కొట్టింది. ఏదో జరగుతుంది. ఈ టైంలో పరీక్షలు చేయిద్దామని చెప్తే మనం దెబ్బలు తినడం ఖాయం అంటుంది తిలొత్తమ్మ. మరోవైపు ఇంట్లో నేత్రి ఫోటో తీసేయడం చూసిన ముక్కోటి కంగారుగా పరుగెత్తుకొచ్చి వైకుంఠాన్ని పిలుస్తాడు. అక్కడున్న నేత్రి ఫోటో ఎవరు తీశారని అడుగుతాడు. దీంతో బామ్మ నేనే తీశానని చెప్తుంది. ఎందుకు తీసేశావని అడిగితే స్వామిజీ చెప్పారు కదా..? నేత్రి ఇంకా బతికే ఉందని అందుకే ఆయన మాటలకు నాకు ధైర్యం వచ్చింది. ఫోటో తీసేశాను అంటుంది. దీతో ముక్కోటి కోపంగా నేత్రి ఇక రాదని వచ్చే అవకాశమే లేదని నువ్వు ఇంకా ఆశలు పెట్టుకోవడం మంచిది కాదని చెప్తూ.. నేత్రి ఎలాగూ రాదు కాబట్టి ఆస్థిని తమకు ఇవ్వమని అడుగుతారు ముక్కోటి, వైకుంఠం. దీంతో ఇద్దరి బామ్మ తిడుతుంది. స్వామిజీ చెప్పినట్టు నేత్రి వస్తుంది. దాని ఆస్తి దాని భర్తకు చెందుతుంది అని చెప్తుంది.
నేత్రి పాట పాడుతూ ముగ్గు వేస్తుంటుంది. విశాల్ గమనిస్తుంటాడు. ఇంతలో దురందర మోడ్రన్ లుక్ లో వస్తుంది. కడుపుతో ఉన్నదానివి నీకు ఫారెన్ ట్రిప్స్ అవసరమా అని అందరూ అడుగుతారు. దురందరను చూసిన నేత్రి ఎవరిది అని అడుగుతుంది. దీంతో దురందర జోక్ చేస్తున్నావా.. నయని అని అడుగుతుంది. జోక్ వేయడం దేనికి నిన్ను నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటుంది. దీంతో దురందర షాక్ అవుతుంది. విశాల్ వచ్చి తను మా నాన్న చెల్లి మా మేనత్త అని చెప్తాడు. పావణమూర్తి నయనికి యాక్సిడెంట్ జరిగిందని అందుకే ఇలా ప్రవర్తిస్తుందని చెప్తాడు.
ఇంతలో అక్కడికి గురువు గారు వస్తారు. గురువు గారికి జరిగిందంతా చెప్తాడు వల్లభ. దీంతో ఇక నేను తెలుసుకోవాల్సింది ఉంది మీరు ఆగండి అంటాడు గురువు. ఇంతలో నేత్రి బాబుగారు నా మానాన నేను ముగ్గు వేసుకుంటుంటే అందరూ వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తుంది. చూస్తున్నారు కదా గురువుగారు ఇది నడిపి కోడలి వాలకం అని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో గురువుగారు నయని అని పిలుస్తాడు. నా పేరు నయని కాదు త్రినేత్రి అని చెప్తుంది. దీంతో నీకు ఈ పేరు ఎవరు పెట్టారని గురువు గారు అడగ్గానే.. అదే నాకు గుర్తుకు రావడం లేదు స్వామి. అని నేత్రి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టి త్రినయని ఎపిసోడ్ పూర్తయిపోతుంది.