EPAPER

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

Kim Jong Un: ఇదేం రూల్ రా నాయనా.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన నార్త్ కొరియా

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన ఏది చేసిన సంచలనమే. తన మొండి వైఖరి గురించి వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటునే ఉంటారు. అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. అందుకే ఉత్తరకొరియాకు మిత్ర దేశాలకంటే, శత్రువులే ఎక్కువ. అందుకే ఆ దేశం మరో భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచంగా పిలుస్తారు జనం. అక్కడి నుంచి ఏ విషయం లీకైనా జనం ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ఆవి అంత వింతగా ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మరోసారి ఆయన ముర్కత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఆ న్యూస్ ప్రపంచానికి ఒక్కసారిగా షాకిచ్చింది.

ప్రస్తుతం నియంత ఎవరు అంటే వెంటనే ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కింగ్ కిమ్ జోంగ్-ఉన్ గుర్తుకొస్తాడు. అలనాటి హిట్లర్ పాలనకు ఏ మాత్రం తగ్గని విధంగా రకరకాల రూల్స్.. శిక్షలతో దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చాలా దేశాలలో నేరాలకు ఉరి శిక్ష విధించడం కంటే జీవిత జైలు శిక్షను అమలు చేస్తున్నారు. చాలా తీవ్రమైన నేరం అనుకుంటేనే మరణశిక్ష విధించబడుతుంది. అదే సమయంలో చాలా దేశాల్లో మరణశిక్షను రద్దు చేశారు కూడా. అయితే తాజాగా ఉత్తర కొరియా దేశంలో తమ దేశ అధికారులకు మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.


ఇది నార్త్ కొరియా..ఈ దేశం పేరు వింటే చావు అందరి గండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అక్కడ రూల్స్ అలాంటివి మరి.. ఎందుకంటే అది మన భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచం. అక్కడి జనాలకు ప్రపంచంలో ఏం జరుగుతున్న సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై కూడా అవగాహన ఉండదు. కేవలం వారికి అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. అతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. వాళ్లే వారికి దేవుళ్లు.. మరి అలాంటి రాజు రాజ్యాన్ని ఎలా పాలించాలి.. ప్రజలకు బిడ్డలా చూసుకోవాలి.. కానీ కిమ్ అలా కాదు.. తప్పు చేస్తే ఊరితీస్తాడు.

అది సామాన్యులైనా.. ఫ్యామిలీ మెంబర్స్ అయినా.. ఇంకెవరైనా.. ప్రపంచం మొత్తం ఒకెత్తు అయితే.. ఉత్తర కొరియాలో కిమ్ పోకడలు మాత్రం మరో ఎత్తు. పాలనలోనే కాదు.. ఆయన పెట్టే రూల్స్ కూడా వెరైటీనే .. ఎంత వెరైటీ అంటే సాధారణంగా ఎవరైనా అధికారులు సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వ అధినేత ఏం చేస్తారు. మహా అయితే బీపీ తెచ్చుకుని అరుస్తారు. ఇంకా కోపం ఉంటే వారి ప్రమోషన్లు ఆపేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి ఇంక్రిమెంట్లు ఆపేస్తారు. వారిని సస్పెండ్ చేస్తారు. లేదా.. ఏదో మూల ప్రాంతానికి బదిలీ చేస్తారు. ఇలా ఏదో ఒక రకంగా వారిపై చర్యలు ఉంటాయి. నేరుగా ఉరితీయ‌డ‌మే. ఉత్తర కొరియా నియంత పాలకుడు. కిమ్ అదే పని చేశారు.

Also Read: రేప్ చేయాలని చూస్తే చచ్చారే.. మృగాళ్ల పనిపట్టే సరికొత్త కండోమ్, ఐడియా బాగుంది మేడం!

నార్త్ కొరియాలో ఇటీవల భారీ వరదలు వచ్చాయి. ఆ వరదలు అలాంటి ఇలాంటి వరదలు కాదు. అసాధారణ రీతిలో వచ్చాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారుగా 4వేల మందికి పైగా మరణించారు. 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఊర్లుకు ఊర్లు నీట మునిగాయి. మొత్తంగా వరదల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించడంలో అక్కడి ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు.

మామూలుగా మన బెజవాడలో వరదలు వస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే.. ప్రజలను కాపాడుకునేందుకు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో స్పందించారు.. ? చూస్తూనే ఉన్నాం. అయితే బెజవాడలో వచ్చిన వరదలు కంటే 30 రెట్లు ఎక్కువ స్థాయి వరదలు ఉత్తర కొరియాకు వచ్చి పలు పట్టణాలను గ్రామాలను ముంచి వేశాయి. ఆ వరదల్లో చాలామంది చనిపోయారు.

కిమ్ కూడా ప్రజలకు కష్టాలు వస్తే స్పందించాలని అనుకుంటున్నారు. అందుకే వరద బాధిత‌ ప్రాంతాల్లో పడవ వేసుకుని మరి పర్యటించారు. మరికొన్ని ప్రాంతాల్లో బురద నీటిలో నడుచుకుంటు వెళ్లారు. వారి సాధక బాధలు చూసి మనోవేదనకు గురయ్యారు. కిమ్ కూడా చాలా బాధపడ్డారు. ఆఖరికి కిమ్ ఇందులో కూడా ఎవరో ఒకరిని బలి చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయారు. వరదల్ని ఆపలేకపోయారని ప్రజలు కిమ్ పై నిందలు వేయలేరు.. కానీ కిమ్ ఏకంగా 30 మందికి పైగా అధికారులను వరదలకు కారణంగా తేల్చారు. మామూలుగా అయితే వారిని ఉద్యోగాల నుంచి తీసేయటమో.. లేదా వారి ఇంక్రిమెంట్లు ఆపటం పనిష్మెంట్ గా చేస్తూ ఉంటారు. కానీ కిమ్ అలా చేయలేదు.. వారిని ఉరితీయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు చెప్పకపోయినా నష్టం ఏమీ లేదు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై నార్త్ కొరియా అదికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏకంగా నేరుగా ఉరి తీయబడ్డారు. అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 30 మంది అధికారులు ఉరి శిక్షను అనుభవించారు. మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను కూడా అక్కడి మీడియా వెల్లడించలేదు. అయితే ఉత్తరకొరియాలో ఇలాంటి కఠినమైన రూల్స్ కొత్తవేమీ కాదు. చాలాసార్లు ఇలాంటి రూల్స్ అమలు చేశారు అక్కడి అధ్యక్షులు కిమ్. సొంత బాబాయినే వదలలేదు ఆయన.

నిజానికి కరోనా సంక్షోభం నుంచి ఉత్తరకొరియా అధికారులను ఉరి తాస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా పని చేయకపోతే నేరుగా ఉరిశిక్ష విధిస్తున్నారు. కరోనా రాకముందు ప్రతి సంవత్సరం 10 మందిని ఉరి తీసేవాళ్లు.. కానీ ఇప్పుడు మాత్రం 100 మందికి పైగా ఉరి తీస్తున్నారట. వింతవింత ఆంక్షలు, నిబంధనలతో ఎప్పుడూ కిమ్ వార్తల్లో ఉంటారు. ఇక కిమ్ పైశాచికత్వం సాధారణంగా ఉండదనేది బహిరంగ రహస్యం. కిమ్ తనకు ఎదురొచ్చిన వారు ఎవరైనా సరై చెపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ తన తండ్రి మరణించిన తర్వాత ఉత్తరకొరియా బాధ్యతల చేపట్టాలని కిమ్ బావ జాంగ్ సాంగ్ తైక్ భావించారు. ఆ ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనతో పాటు ఆయన్ను కూడా అత్యంత కిరాతకంగా అంతమొందించారట కిమ్. ఆ సమయంలో జాంగ్ సాంగ్ తైక్ వర్గం కిమ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కిమ్ కు నచ్చని వారు ఎవరైనా సరై పాతాళానికి వెళ్లాల్సిందే అని అతని స్నేహితులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సొంత మామ జాంగ్ సంగ్‌కి కూడా కిమ్ జాంగ్ మరణ శిక్ష విధించారు. కుక్కల బోనులోకి పంపించి అతన్ని హత్య చేయించారు. అక్కడి మీడియా కూడా జాంగ్ సంగ్ ను కుక్క కంటే అధ్వాన్నమైనవాడిగా అభివర్ణించింది. ఆ తర్వాత తన సోదరుడు కిమ్ జోంగ్ నామ్ ను సైతం కిమ్ విషం పెట్టి హత్య చేయించారు. కౌలాలంపూర్ లో జరిగిన ఈ హత్య ప్రపంచాన్నే నివ్వెరిపరిచింది.

Also Read: ఏకధాటిగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి.. చివరికి ఆస్పత్రిలో..

ఇలా ఒక్కటేమిటి చివరికి ప్రత్యర్థి దేశం ప్రోగ్రామ్స్ చూసిన కిమ్ కి కోపమే. దక్షిణ కొరియా డ్రామా సిరీస్ లను చూసినందుకు30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఇంతకు ముందు కరోనా టైంలో ఉత్తర కొరియా ను బందీ చేశాడు కిమ్. బయట దేశాల నుంచి రాకపోకలు, నార్త్ కొరియా వాళ్లు బయటకు వెళ్లకుండా కఠినంగా వ్యవహరించారు. కానీ ఓ దంపతులు మాత్రం పిల్లాడితో దేశం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. బ్యాంకాక్ బోర్డర్ వద్దకు చేరుకున్నారు.

నార్త్ కొరియా నుంచి బ్యాంకాక్ బోర్డర్ లోకి వెళ్తుండగా బోర్డర్ వద్దనుండే సిబ్బంది వారిని పసిగట్టి బంధించారు. ఎందుకు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించారని అడుగగా.. అసలు విషయం చెప్పారు. కానీ నార్త్ కొరియా సిబ్బంది వారి మాటలను నమ్మలేదు. బోర్డర్ దాటేందుకు ప్రయత్నించి నేరం చేశారంటూ నిందించి వారికి ఉరిశిక్ష విధించారు. ఆ బాలుడు మైనర్ కావడంతో అతడిని మాత్రం హోమ్ కు తరలించారు. ఇలా ఏ తప్పు చేయని వారిని ఉరితీసిన నార్త్ కొరియా విమర్శలను ఎదుర్కొంటోంది. పాపం ఆ దంపతులు ఏ తప్పు చేయకపోయినా తనువు చాలించారు. ఇలా బయటికి రాని ఎన్నో ఘటనలున్నాయి. దీనిపై దేశంలోనే కాదు.. అంతర్జాతీయ సంస్థలు మండిపడుతున్నాయి. కానీ కిమ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా అయినా కిమ్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. ఇది మాత్రం దుర్మార్గమైన చర్యగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.

 

Related News

KCR – Kavitha: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

Roja vs Syamala: రోజా ఏమయ్యారు? మీడియా ముందుకు రాలేక.. రికార్డెడ్ వీడియోలు, ఉనికి కోసం పాట్లు?

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

Big Stories

×