Allu Vs Mega : గత కొంతకాలం నుంచి లోకల్ నుంచి నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ వార్తలతో మార్మోగిపోతోంది. సోషల్ మీడియా సైతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ (Allu Arjun) కాంట్రవర్సీ, లేదంటే ‘పుష్ప 2’ (Pushpa 2) కలెక్షన్స్ గురించే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే త్వరలో రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీకి పుష్ప రాజ్ తలనొప్పిగా మారాడు.
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. పొంగల్ కానుకగా 2025 జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో చాలా రోజుల ముందు నుంచే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక రీసెంట్ గా అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ ను నిర్వహించి ప్రమోషన్లలో జోరు పెంచారు. పైగా ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.
కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ గురించే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’కి ఇదే సమస్యగా మారింది. సోషల్ మీడియా స్పేస్ పూర్తిగా ‘పుష్ప 2’ మూవీ, సంధ్య థియేటర్ ఇష్యూ చుట్టు తిరుగుతోంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఎవరిది తప్పు ? ఎవరిది ఒప్పు అని చర్చించుకోవడంలో మునిగిపోయారు అందరూ. దీంతో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి ఇంకా రెండు వారాలు టైం ఉన్నప్పటికీ మూవీ గురించి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ధోప్’ సాంగ్ పై ట్రోలింగ్ నడిచింది. ఇలాగైన ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటే, అంతలోనే మరోవైపు ఎన్టీఆర్ సాయం చేయలేదు అంటూ కౌశిక్ తల్లి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఏదేమైనా శంకర్ – రామ్ చరణ్ సినిమాకు రావాల్సిన బజ్ మాత్రం ఇది కాదు. రేపు సినీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. అలా కలిసిన తర్వాత సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వివాదం చల్లబడే ఛాన్స్ ఉంటుంది. కానీ మరో రెండు రోజుల పాటు ఈ వివాదం గురించిన చర్చ ఇలాగే నడుస్తుంది.
ఇక ఆ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రమోషన్లు జోరందుకుంటాయి అని సంతోష పడే ఛాన్స్ కూడా లేదు మెగా ఫ్యాన్స్ కి. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’ ప్రమోషన్లను సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకీ మామ షురూ చేశారు. అందులో భాగంగా వెంకటేష్ ‘అన్ స్టాపబుల్ 4’ షోలో బాలయ్యతో సందడి చేయబోతున్నారు. మరోవైపు బాలకృష్ణ ‘డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. ఇలా ఇన్ని సినిమాలు మధ్య స్పెషల్ గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై మూవీ లవర్స్ ఫోకస్ చేయడం కష్టమేనని చెప్పాలి. మరి ఈ రెండు వారాల గ్యాప్ లో మేకర్స్ ఎలాంటి ప్రమోషనల్ స్ట్రాటజినీ ఫాలో అవ్వనున్నారు? ప్రేక్షకుల దృష్టిని ఏ రకంగా తమ వైపు తిప్పుకోబోతున్నారనేది చూడాలి.