
NTR IN Oscars Panel : రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ కమిటీలోని కొత్త మెంబర్స్ లిస్ట్‌లో తారక్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని అకాడమీ పోస్ట్ చేస్తూ.. ‘నాటు నాటు’ పాట విజువల్స్‌ను షేర్ చేసింది.
తొలి తెలుగు హీరో..
ఈ ఏడాది ఆస్కార్ కమిటీ 398 మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్‌లో చోటు దక్కింది. భారత్ నుంచి 11 మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందులో భారత్ నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్ ప్రకటించింది. దీంతో ఆస్కార్ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ ఖ్యాతి దక్కించుకున్నారు. కొత్తగా ఆస్కార్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారందరికీ రాబోయే ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఓటు హక్కు ఉంటుంది.
Pawan Sagar: జనసేనలోకి మొగలి రేకులు హీరో సాగర్