Killer Glimps:’గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా తనకంటూ ఒక పాపులారిటీ సొంతం చేసుకున్న జగతి అలియాస్ జ్యోతి రాయ్ (Jyothi Rai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్న వయసులోనే తన వయసుకు మించిన క్యారెక్టర్ తో అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను వివాహం చేసుకున్న జ్యోతి పూర్వాజ్ (Jyothi Poorvaj)గా మారిపోయింది. ఇక అతడి దర్శకత్వంలోనే తాజాగా ‘కిల్లర్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది జ్యోతి పూర్వాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలలో అదరగొట్టేసిన ఈమె.. యాక్షన్ పర్ఫామెన్స్ తో విధ్వంసం క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోకి కూడా సాధ్యం కానీ రేంజ్ లో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది జ్యోతి. దీనికి తోడు అత్యంత క్రూరంగా ప్రవర్తించిన తీరు గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచింది. మొత్తానికైతే గ్లింప్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది జ్యోతి పూర్వాజ్.
కిల్లర్ గ్లింప్స్ లో ఏముందంటే…?
గ్లింప్స్ విషయానికి వస్తే.. ప్రాచీనమైన వైమానిక శాస్త్రంలో మానవ మేధస్సు రహస్యాలను ఆశ్చర్యం కలిగే శక్తుల మూలాలను అప్పట్లో కథలుగా చెప్పుకునే వాళ్ళు. ఆ కథే ఇప్పుడు నిజం కాబోతోందా అంటూ గ్లింప్ స్టార్ట్ చేశారు. ఒక సాధారణమైన మనిషి.. అసాధారణమైన మనిషిగా మారబోతున్న అంటూ రోబోగా మారిన జ్యోతిని చూపించారు. ఇక రొమాంటిక్ యాంగిల్ తో రెచ్చిపోయిన ఈమె రోబో గా మారిన తర్వాత ఎలా విధ్వంసం సృష్టించింది అనే విషయాన్ని ఇందులో చాలా చక్కగా చూపించారు. ఇందులో తన గ్లామర్ తో ఎలా అయితే ఆకట్టుకుందో.. యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. అంతేకాదు సైకో కిల్లర్ గా మారి ఒక వ్యక్తినీ కత్తితో పొడిచిన తీరు చూస్తే భయం కలుగుతోంది. మొత్తానికైతే వయసుకు మించిన పాత్రలతోనే కాదు ఊహకు మించిన పాత్రలతో కూడా అదరగొట్టేయగలరు అని నిరూపించుకుంది జ్యోతి..ప్రస్తుతం ఈ గ్లింప్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.
ALSO READ:Shalini Ajith Kumar: ఇన్నేళ్లకు బయటకొచ్చిన షాలినీ.. ఆమెలో ఇది గమనించారా..?
జ్యోతిరావు కిల్లర్ మూవీ..
జ్యోతిరావ్ విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు సీరియల్స్ లో చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేస్తుంది. ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ సుకు పూర్వాజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది. విశాల్ రాజ్, గౌతమ్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక స్పై, యాక్షన్, రొమాంటిక్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , థ్రిల్లర్ వంటి అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.