Kiran On Musi River: నాలుగైదు గంటలు భారీ వర్షం పడితే చాలు.. ట్రాఫిక్ జామ్ మాట దేవుడెరుగు. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు వచ్చేస్తోంది? దీనికి కారణం ఎవరు? కళ్ల ముందు జరుగుతున్న విపత్తుల ను చూసి, తాము పట్టిన దానికి మూడు కాళ్లంటూ బీఆర్ఎస్ ఎందుకు వ్యవహరిస్తోంది?
ఓ మాదిరి వర్షానికి చెన్నై, బెంగళూరు నగరాల్లో నీళ్లలో ఉండటానికి కారణమెవరు? డ్రైనేజీ వ్యవస్థ కుదించుకు పోవడమా? చెరువులు నాశనం కావడమే కారణమా? మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైడ్రా, మూసీ పరిరక్షణను బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటోంది? ఇవే ప్రశ్నలు భాగ్యనగర వాసులను వెంటాడుతోంది.
మొన్న విజయవాడ, నిన్న బెంగుళూరు, చెన్నై నగరాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నాలుగైదు గంటలపాటు పడిన వర్షానికి రోడ్లు జలమయం అవుతున్నాయి. దాని ఫలితం నగర వాసులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇందుకు ఎగ్జాంపుల్ ఆయా నగరాలు. అలాంటి పరిస్థితి రాకూడదన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌కు మునుపటి పరిస్థితి తీసుకురావాలని ప్లాన్ చేశారు.. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.
బుధవారం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా, మూసీ అభివృద్ధిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి వాటిని అడ్డుకుంటామని కుండబద్దలు కొట్టేశారు. ఎందుకని మీడియా ప్రశ్నిస్తే పేద ప్రజల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ALSO READ: పెద్ద పెద్ద నగరాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ సేఫేనా?
బెంగుళూరు, చెన్నై వర్షాలపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. ముందు చూపుతో ఎవరైనా అడుగు వేస్తే స్వాగతించాల్సింది పోయి.. అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కళ్ల ముందు జరుగుతున్న విపత్తులను చూసి నేతలు పాఠాలు నేర్చుకోలేదు.
దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తన మనసులోని మాట బయటపెట్టారు. హైడ్రా, మూసీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారాయన. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకూడదన్నది ఆయన మాట.
భారీ వర్షాలు, వరదలతో మునిగిన చెన్నై మహానగరం..
చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలే నగరాల ముంపునకు కారణమంటున్న మేధావులు
హైడ్రా లేకపోతే.. హైదరాబాద్ పరిస్థితి కూడా ఇంతేనంటున్న నిపుణులు@Comm_HYDRAA#Hydraa #ChennaiFloods #BigTV pic.twitter.com/DlSyTnnZOu
— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2024
ముఖ్యమంత్రి @revanth_anumula గారు మూసీ ప్రక్షాళన, మూసీ పరిరక్షణ నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో హైదరాబాద్ కి ఇటువంటి పరిస్థితి రాకూడదని…
గత నాలుగు రోజులుగా చెన్నై, బెంగళూరులో పరిస్థితి చూస్తున్న హైదరాబాద్ ప్రజలు సిఎం @revanth_anumula గారు తీసుకున్న నిర్ణయం సరైనదే అని… pic.twitter.com/LztDF7yVYx— Kiran Kumar Chamala (@kiran_chamala) October 16, 2024