Johnny Master – Jyothi Raj : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. జూనియర్ డ్యాన్సర్ ఆయన పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ కేసు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. అత్యాచారం కేసుతో పాటుగా తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఈ ఫిర్యాదు తర్వాత ఇప్పటివరకు జానీ మాస్టర్ బయటకి రాకపోవడంతో అందరూ జానీ మాస్టర్ ని విమర్శిస్తున్నారు. ఈ విషయం పై ఇప్పటికే టాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. దీనిపై పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అసలు విషయాలు తెలియకుండా రెండు వైపులా స్టోరీ తెలియకుండా, ఆరోపణలు ప్రూవ్ అవ్వకుండా ఫేమ్ ఉన్న ఒక వ్యక్తిపై మాటల దాడి చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆట సందీప్ భార్య, ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో డైరెక్ట్ గా జానీ మాస్టర్ కేసు అని చెప్పకుండా కేసుకు సంబంధించి ఇండైరెక్ట్ గా ఆమె చెప్పింది. జ్యోతికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో జ్యోతి రాజ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. చాలామంది అమ్మాయిల గురించి ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్దవాళ్ళను అయినా వాళ్ళను వదలకూడదు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ తో లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు, వాళ్ళని కూడా శిక్షించాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్ ని మన వ్యూస్ కోసం, ఇంటర్వూస్ కోసం వాడొద్దు. తప్పు చేస్తే కచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే.. అసలు నిజం ఏంటో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇక జానీ మాస్టర్ పై పోలీసులు ‘పోస్కో’ చట్టం క్రింద కేసు ని నమోదు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. ముందుగా నార్త్ ఇండియా, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కానీ అక్కడ దొరకలేదు. బెంగళూరు, గోవా ప్రాంతాల్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టగా గోవాలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అక్కడి కోర్టు లో నేడు ఉదయం ఆయనని ప్రవేశ పెట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
View this post on Instagram