BigTV English
Advertisement

K.Viswanath: ఊపిరి పోసుకుంటున్న కళాతపస్వి.. చివరి సినిమా విడుదలకు సిద్ధం.!

K.Viswanath: ఊపిరి పోసుకుంటున్న కళాతపస్వి.. చివరి సినిమా విడుదలకు సిద్ధం.!

K.Viswanath.. తెలుగు సినిమా దర్శకులైన కాశీనాథుని విశ్వనాథ్ (K.Viswanath) తెలుగులో సుప్రసిద్ధ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన ఈయన సౌండ్ రికార్డిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి , అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది బహుమతి కూడా అందుకున్నారు. ముఖ్యంగా ఈయన దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమా ఎంతటి గుర్తింపును సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆయన తీసిన చిత్రాలలో సాగర సంగమం, శృతిలయలు, స్వాతికిరణం, స్వర్ణకమలం, సిరివెన్నెల ఇలా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈయన దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా మెప్పించారు. మరోవైపు ఈయన సినిమా రంగానికి చేసిన కృషికి గానూ 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అలాగే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తన అద్భుతమైన డైరెక్షన్ తో కళాతపస్వి అనే బిరుదును కూడా అందుకున్న ఈయన 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా 2023 ఫిబ్రవరి 2న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత ఆయన చివరిగా చేసిన సినిమా ఇద్దరు ఇప్పుడు మళ్లీ విడుదలకు సిద్ధం కాబోతోంది.


విడుదలకు సిద్ధమవుతున్న కళాతపస్వి చివరి చిత్రం..

జే.డీ. చక్రవర్తి, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్లో, డి.ఎస్.రెడ్డి సమర్పణలో.. ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇద్దరు. ఈనెల 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోనీ చరిష్టా మాట్లాడుతూ.. చక్రవర్తి , అర్జున్ సినిమాలో నాకు చాలా సపోర్ట్ చేశారు. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీడియా, ప్రేక్షకులు మా సినిమా ను సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది.


కళాతపస్వి మళ్లీ ఊపిరి పోసుకోనున్నారా..

ఈ సినిమా దర్శకనిర్మాత సమీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి లొకేషన్స్ లో హై క్వాలిటీ తో చేసాము. అర్జున్, జెడి ఇద్దరు పోటీ పడుతూ నటించారు. హీరోయిన్స్ గా రాధికా కుమారస్వామి, సోనీ పెర్ఫార్మన్స్ ఇరగదీసారు. కళాతపస్వి కే. విశ్వనాథ్ చివరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఆయన ఎంతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. అంతేకాకుండా ఒక పాటలో స్టెప్స్ కూడా ఆయన వేశారు. ఇందులో అమీర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. ఇలా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇకపోతే కళాతపస్వి కే. విశ్వనాథ్ నటించిన చివరి సినిమా కావడంతో ఆయన మళ్లీ మన ముందుకి ఊపిరి పోసుకుని వస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈయన కోసమైనా సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×