BigTV English

First Wooden Satellite : అదిగో.. తొలి వుడెన్ శాటిలైట్

First Wooden Satellite : అదిగో.. తొలి వుడెన్ శాటిలైట్

First Wooden Satellite : ఉపగ్రహాలను వేటితో తయారుచేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకోకండి. శాటిలైట్ల తయారీలో లోహాలనే వినియోగిస్తారని ఇప్పటివరకు మనకు తెలుసు. వచ్చే ఏడాది కొయ్య ఉపగ్రహాలు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకీ అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోతుండటంతో చెక్కతో చేసిన శాటిలైట్లను ప్రయోగించాలని నాసా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) నిర్ణయించాయి. ఇందులో భాగంగా వచ్చే వేసవిలో లిగ్నోశాట్(LignoSat) అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.


కాఫీ మగ్ సైజులో ఉండే ఈ శాటిలైట్‌ తయారీకి తొలిసారిగా చెక్కనే వినియోగిస్తున్నారు. జపాన్‌లో దొరికే మాగ్నోలియా(magnolia) కలప అంతరిక్ష ప్రయోగాలకు దివ్యంగా పనిచేస్తుందని పరీక్షల్లో తేలింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో ఈ చెక్కను క్యోటో యూనివర్సిటీ పరిశోధక బృందం పది నెలల పాటు వివిధ దశల్లో పరీక్షించి చూసింది.

దృఢత్వంతో పాటు అత్యంత ప్రతికూల వాతావరణంలో ఎలాంటి మార్పులకు లోనవుతుందన్నదీ నిశితంగా పరిశీలించారు. కాస్మిక్ కిరణాలను, అత్యంత ప్రమాదకరమైన సోలార్ పార్టికల్స్‌ను సైతం మాగ్నోలియా చెక్క తట్టుకున్నట్టు రూఢీ అయింది. శూన్యంలో ఈ చెక్క ఏ మాత్రం చెక్కుచెదరకపోవడం మరో సానుకూల అంశం.


ఉపగ్రహాల్లో చెక్క వినియోగం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తేలికగా ఉండటంతో పాటు గట్టిదనం, మన్నికలో ఇదే బెస్ట్. పైగా బయోడీగ్రేడబుల్. లోహాలతో తయారైన ఉపగ్రహాలైతే తిరిగి భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు భస్మీపటలమవుతాయి. కొయ్య ఉపగ్రహాలతో అలాంటి సమస్య ఉండదు. టైటానియం, అల్యూమినియంతో తయారయ్యే శాటిలైట్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటితో పోలిస్తే చెక్కతో ఉపగ్రహాల తయారీ అత్యంత చౌక కాగలదు.

ఈ ఎకోఫ్రెండ్లీ శాటిలైట్ ఢీకొన్నప్పుడు జరిగే నష్టమూ కూడా తక్కువే. అయస్కాంత క్షేత్రాన్ని, ఎలక్ట్రానిక్ తరంగాలను చెక్క అడ్డుకోలేదు కాబట్టి.. లిగ్నోశాట్‌కు బిగించే యాంటెన్నా దివ్యంగా పనిచేయగలదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఘనాకారంతో 10 చదరపు సెంటీమీటర్ల సైజులో ప్రోటోటైప్ లిగ్నోశాట్‌ను నాసా-జాక్సా శాస్త్రవేత్తలు రూపొందించారు. సైప్రెస్, సెడార్ వంటి సాధారణ చెక్కలను సైతం పరిశీలించిన వారు చివరకు మాగ్నోలియాకే ఓటేశారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×