BigTV English

Kajal Aggarwal : తొలిసారి ఆ పని కి సై అంటున్న కాజల్.. అసలు రీసన్ అదే..

Kajal Aggarwal : తొలిసారి ఆ పని కి సై అంటున్న కాజల్.. అసలు రీసన్ అదే..
Kajal Aggarwal

Kajal Aggarwal : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. అందం, అభినయం కలగలిపిన ఈ చందమామ.. సుదీర్ఘ కాలం పాటు సినీ ఇండస్ట్రీ పై తన ప్రభావాన్ని చూపించింది. తల్లి అయిన తర్వాత కెరియర్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ తిరిగి మళ్లీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లో సందడి చేస్తూ.. వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా మారింది.


ఇటీవల బాలకృష్ణ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’లో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో తిరిగి రెట్టింపు ఊపుతో మళ్ళా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది ఈ భామ. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం సత్యభామ లో బిజీగా ఉంది కాజల్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఎక్కువ హైలెట్ చేశారు.’సత్యభామ’ సినిమా కు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇక చిత్ర బృందం వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇందులో హీరోయిన్ కనిపించిన విధానం.. బాడీ లాంగ్వేజ్.. యాక్షన్ సీక్వెన్స్.. బాగా హైలైట్ గా నిలిచాయి. అదేవిధంగా ఈ మూవీతో క్రేజ్ రావడం కన్ఫామ్ అనుకున్న కాజల్ సరికొత్త నిర్ణయం తీసుకుందని టాక్.


ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ ..కాజల్ అగర్వాల్ సొంతంగా చెప్పబోతుందట. అంటే మొదటిసారి టాలీవుడ్ లో ఒక సినిమాకి పూర్తిగా కాజల్ ఆమె గొంతను అందించినట్లు అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ కోసం కొన్ని రిస్కీ షాట్స్ ని కూడా కాజల్ ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేసిందంట. దీంతో ప్రస్తుతం ఈ చిత్రం పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×