Kajal Aggarwal: ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు రామాయణం లేదా మహాభారతం ఇతిహాసాలను తెరపై చూపించడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రేక్షకులు కూడా ఈ ఇతిహాస కథలను తెరపై చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ (Ramayana). ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), ప్రముఖ నటి సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nithesh Tiwari) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక అప్డేట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.
హిందీ రామాయణ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కాజల్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇందులో ప్రముఖ సీనియర్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో రావణాసురుడి సతీమణి మండోదరి (Mandodari) పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం కాజల్ అగర్వాల్ ను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాత్రకు తగ్గట్టుగా లుక్ టెస్ట్ జరిగిందని, ఆమె కూడా ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అయిందని, ఇక అందుకే ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కన్నడ నటుడు యష్ కి జోఢీ గా కాజల్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో యష్ రావణాసురుడు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన షూటింగ్లో పాల్గొంటున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.
రెండు భాగాలుగా హిందీ రామాయణ మూవీ..
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీకి బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. దంగల్, భవాల్ వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న రామాయణ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. అందుకే ఈ సినిమా అప్డేట్ తెలుసుకోవాలని తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే యష్ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నమిత మల్హోత్రా తెలిపారు. గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” 5000 సంవత్సరాలకు పైగా కోట్లాదిమంది ప్రజల హృదయాలను పాలిస్తున్న ఈ ఇతిహాస రామాయణాన్ని తెరపైకి తీసుకురావడానికి గత పది సంవత్సరాలుగా అన్వేషణ మొదలుపెట్టాము. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తాము. ఈ చిత్రం కోసం విశ్రాంతి లేకుండా మేము పనిచేస్తూనే ఉంటాము” అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త అభిమానులలో సరికొత్త అంచనాలు పెంచేస్తోందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇందులో నటిస్తోందని తెలిసి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. మరి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Big TV Kissik Talks: ఆమనికి ఆ హీరోయిన్ అంటే అంత పిచ్చా.. చావుకి కూడా సిద్ధం అంటూ..!