Sweating: శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని లోపాల వల్ల శరీరంలో ఎక్కువగా చెమట వస్తుందని చెబుతున్నారు. విపరీతమైన చెమట ఈ తీవ్రమైప అనారోగ్యానికి సంకేతం.. అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే శరీరంలో విటమిన్ డి లోపం వల్ల చెమట ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్స్‌లో విటమిన్ డీ ఒకటి. ఎముకల ఆరోగ్యం మొదలు మానసిక ఆరోగ్యం వరకు అన్నింటిలోను విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీ లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చెమట పట్టడం అనేది సహజమైన ప్రక్రియ అని తెలిసిందే. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కూడా చెమట కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సాధారణంగా వాతావరణం వేడిగా ఉంటేనో, శారీరక శ్రమ ఎక్కువగా చేస్తేనో చెమటపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో విటమిన్ డి లోపం వల్ల కూడా చెమట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని హైపర్ హైడ్రోసిస్‌గా పిలుస్తారు.
విటమిన్ డీ శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనత సమస్య వేధిస్తున్న అది కూడా విటమిన్ లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డీ మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్. విటమిన్ డీ లోపం వల్ల ఎముకల బలహీనంగా మారుతాయి, బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం, పల్చబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ప్రెగ్నెన్సీతో ఉన్నారా.. ఈ ఆహారం జోలికి అస్సలు వెళ్లకండి
అంతేకాకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. స్పైసీ ఫుడ్స్, ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్, కెఫిన్ వల్ల కూడా చెమట ఎక్కువగా వస్తుంది. అలాగే శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుందంటున్నారు. షుగర్ ఉంటే కూడా చెమట వస్తుందని పలు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చెమట పట్టడం అనేది గుండె జబ్బులకు కారణం కావచ్చని అంటున్నారు. ఇలా చెమటలు పట్టేవారు ఎక్కువగా ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి, మద్యపానాలను అవాయిడ్ చేయాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు కాస్త చెమట పట్టణం నుంచి ఉపశమనం పొందవచ్చు.
తక్కువ రక్త పోటు వల్ల కూడా చెమట వస్తుందట. అంతేకాకుండా హైపర్ హైడ్రోసిస్ అనేది ఒక వ్యాధి.. అయితే ఈ వ్యాధి వల్ల కూడా చెమట ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. అలాగే ఉబకాయం ఉండటం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. సో చల్లని ప్రదేశంలో కూడా మీకు ఎక్కువగా చెమటలు పడుతుంటే మీకు ఈ సమస్యలు ఉన్నట్లు అని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు. కావున చెమటలు ఎక్కువగా వస్తు వెంటనే వ్యైద్యులను సంప్రదించండి.