Sandeep Reddy -Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)వర్సెస్ దీపికా పదుకొనే(Deepika Padukone) అనే విధంగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. స్పిరిట్(Spirit) సినిమా కారణంగా సందీప్ రెడ్డి వంగ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను హీరోయిన్ గా తీసుకోవటం కోసం సందీప్ రెడ్డి ఆమెను సంప్రదించారు. అయితే ఈ సినిమాలో నటించడం కోసం దీపికా పదుకొనే కొన్ని కండిషన్లు కూడా పెట్టారని తెలుస్తోంది. దీపిక పెట్టిన కండిషన్లు నచ్చకపోవటం వల్లే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించడంతో వివాదం చెలరేగింది.
దీపికా కండిషన్లు నచ్చలేదా…
స్పిరిట్ సినిమాలో నటించడం కోసం దీపికా పదుకొనే ఏకంగా రూ. 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. అలాగే తనకు చిన్న పాప ఉన్న నేపథ్యంలో ఎనిమిది గంటలు పని చేయనని కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తానని, అదనపు రోజులలో షూటింగ్లో పాల్గొంటే కనుక తనకు రెమ్యూనరేషన్ కూడా అదనంగా చెల్లించాలని కండిషన్లు పెట్టారని వార్తలు హల్చల్ చేశాయి. ఇలా ఈమె పెట్టిన కండిషన్లు నచ్చకపోవటం వల్లే సందీప్ రెడ్డి ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఈ సినిమా నుంచి దీపిక తప్పుకున్న అనంతరం స్పిరిట్ సినిమా స్టోరీ బయటకు లీక్ చేశారని, సందీప్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఇది కాస్త వివాదంగా మారింది.
దీపికాకు పెరుగుతున్న మద్దతు..
ఇలా వీరిద్దరి మధ్య రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాదం పై స్పందిస్తూ పరోక్షంగా నటి దీపికా పదుకొనేకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నటి తమన్నా దీపికా పదుకొనేకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను లైక్ చేయటం ఆసక్తికరంగా మారింది . ఈ రీల్ లో మహిళలు పని చేసే చోట లింగ వ్యత్యాసం, పని వేళలు, ఒత్తిడి వంటి అంశాలను చూయిస్తూ రీల్ చేశారు. అయితే ఆ రీల్ కు తమన్నా లైక్ కొట్టడంతో ఈమె పూర్తిస్థాయిలో తన మద్దతు దీపిక పదుకొనేకే తెలియజేశారని స్పష్టమైనది.
Both #AjayDevgn and #Kajol have come out in support of #DeepikaPadukone, showing thoughtful consideration for her alleged demand of an 8-hour work shift!
Vc: Bollywood Chronicle#SandeepReddyVanga #Spirit pic.twitter.com/DM8du1aGdu
— Bollywood Talkies (@bolly_talkies) May 29, 2025
ఇకపోతే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన కాజోల్(Kajol), అజయ్ దేవగన్ (Ajay Devagan)దంపతుల సైతం సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురవడంతో వారు తమదైన శైలిలోని సమాధానం ఇచ్చారు. మాట్లాడుతూ చాలామంది నిర్మాతలతో ఇలాంటి సమస్య ఉండదు కానీ కొంతమందితో మాత్రమే సమస్య ఉంటుంది. చిన్న బేబీ ఉన్న మదర్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పని చేయటం అనేది కష్టమని అయితే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అంటూ అజయ్ దేవగన్ సమాధానం ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరు కూడా పరోక్షంగా దీపికా పదుకొనేకు మద్దతు తెలియజేయడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి ఒంటరి అవుతున్నారని, ఇలాగే కొనసాగితే ఆయన బాలీవుడ్ లో కొనసాగడం కష్టమనే సంకేతాలు కూడా వినపడుతున్నాయి.