Mad Square – Swathi Reddy Song : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలద్రోక్కుకోవడం అనేది చాలా పెద్ద పని. చాలా ఏళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఒక మంచి కథను సిద్ధం చేసుకుని తర్వాత కొంతమంది హీరోలకు చెప్పి, వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకొంతమంది హీరోలను వెతుక్కోని, ఫైనల్ గా ఒక హీరోతో సెట్ అయి, కొన్ని రోజులు ట్రావెల్ చేసి, కొన్ని కారణాల వలన ఆగిపోయిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు జరిగిన పరిణామాలు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొంతమేరకు ప్రస్తుతం మారింది అని చెప్పొచ్చు. ఒక్క సినిమాతో ప్రూవ్ చేసుకుంటే చాలు వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. దీనికి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక మంచి బ్యానర్ దొరికితే ఖచ్చితంగా మన టాలెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పొచ్చు.
మ్యాడ్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు కళ్యాణ్ శంకర్. మ్యాడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కథ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా ఒక మామూలు కథని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పి ఆడియన్స్ ని నవ్వించాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అవ్వాల్సిన కళ్యాణ్ శంకర్ ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో లేట్ అవ్వడం వలన మ్యాడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బ్యాడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో మూడు క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా డిడి క్యారెక్టర్ కి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఒక సందర్భంలో డిడి క్యారెక్టర్ ఎవరూ లేనప్పుడు క్లాస్ రూమ్ లో తాగుతూ ముద్దు పేరు పెట్టుకుంది స్వాతి రెడ్డి అనే పాటకు వైబ్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అదే పాటను మాడ్ స్క్వేర్ సినిమాలో ఫుల్ సాంగ్ గా ప్లాన్ చేశారు చిత్ర యూనిట్.
Also Read : Sankranthiki Vasthunam : చితక్కొట్టావు కదా వెంకీ మామ, బ్లాక్ బస్టర్ పొంగల్
మ్యాడ్ సినిమాకు సీక్వల్ గా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా వస్తుంది. ఇదే బ్యానర్ లో టిల్లు సినిమాకి సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అయిన సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాలోని స్వాతి రెడ్డి అని ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కొన్ని పాటలు వినగానే ఎక్కుతాయి. ఈ పాట కూడా అదే లిస్టులోకి చేరుతుంది అని చెప్పొచ్చు. పాట సాంగ్ అయిన అప్పటినుంచి విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటకు సురేష్ లిరిక్స్ అందించారు. భీమ్స్ సిసిరోలి, స్వాతి రెడ్డి అనే ఇద్దరు ఈ సాంగ్ ని ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు రెస్పాన్స్ పెరగడం మొదలైంది. మ్యాడ్ సినిమాల్లో కళ్ళజోడు సాంగ్ లాగా ఈ సినిమాలో స్వాతి రెడ్డి పాట ఇంకా హిట్ కానుంది అని చెప్పొచ్చు.