Longest Train Journey In The World: ప్రపంచంలోని చాలా దేశాల్లో రైల్వే నెట్ వర్క్ లు ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా, భారత్ అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లతో టాప్ లో కొనసాగుతున్నాయి. చాలా వరకు ఏ దేశంలో ఆ దేశానికి సంబంధించిన రైళ్లే నడుస్తుంటాయి. తమ ప్రజలను గమ్య స్థానాలకు చేర్చుతుంటాయి. అయితే, ఇప్పుడు మనం ఓ స్పెషల్ ట్రైన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రైలు ప్రపంచంలోనే అత్యధిక దేశాలను కలుపుతూ, అత్యంత దూరం ప్రయాణిస్తున్నది. పోర్చుగల్ లోని లాగోస్ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం ఏకంగా 13 దేశాలను దాటుతూ సింగపూర్ కు చేరుకుంటుంది. 21 రోజుల పాటు 18, 755 కిలో మీటర్ల దూరం ఏక బిగిన ప్రయాణం చేస్తుంది. ఈ రైలులో ప్రయాణం చేసేందుకు పలు దేశాల నుంచి టూరిస్టులు తరలి వస్తారు. మూడు వారాల పాటు ఈ రైల్లో ప్రయాణిస్తూ, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు.
ఈ రైలు ప్రయాణించే దేశాలు ఇవే!
ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోర్చుగల్-సింగపూర్ రైలు పోర్చుగల్ లోని అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన లాగోస్ నగరం నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయ్ లాండ్ ను దాటుకుంటూ సింగపూర్ చేరుకుంటుంది. పారిస్, మాస్క్, బీజింగ్, బ్యాంకాక్ లాంటి ప్రముఖ నగరాలను కలుపుతూ ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ రైలుకు కేవలం 11 ప్రాంతాల్లోనే రూట్ స్టాఫ్ లు ఉంటాయి. ఒకసారి ఈ ప్రయాణం మొదలయ్యాక, మూడు వారాల పాటు ఆగకుండా కొనసాగుతుంది. ప్రయాణ సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, ప్రయాణ వ్యవధి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ రైలును ఏ ఒక్క దేశం ప్రత్యేకంగా నిర్వహించదు. పలు దేశాలు కలిపి సంయుక్తంగా ఈ ట్రైన్ ను నడిపిస్తాయి. లావోస్, చైనా మధ్య రీసెంట్ గా ప్రారంభించబడిన రైల్వే లైన్ యూరప్, ఆసియాకు అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించింది.
రైల్లోనే ప్రయాణీకులకు అవసరమైన భోజనం తయారీ
ఇక ఈ రైల్లో ప్రయాణించే వారికి అందులోనే భోజనం తయారు చేస్తారు. అవసరమైన ఫుడ్, వసతి కల్పిస్తారు. ప్రయాణంలో ఆహారంతో పాటు డ్రింక్స్ కూడా అందిస్తారు. ఇవన్నీ టికెట్ డబ్బుల్లోనే అందిస్తారు. ప్రయాణం కొనసాగే 21 రోజుల పాటు అందరికీ అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తారు.
రైలు టికెట్ ధర కూడా తక్కువే!
ఏకంగా 13 దేశాలను కలుపుతూ వెళ్లే ఈ సుదీర్ఘ ప్రయాణం కోసం టికెట్ ధర కూడా చాలా తక్కువగానే ఉంది. ఈ రైలుకు సంబంధించి ఒక్కో టికెట్ ధర 1,350 డాలర్లుగా ఉంటుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ. 1, 13, 988. విమాన ఛార్జీలతో పోల్చితే ఇది చాలా తక్కువగా ధర. ఈ రైలులో ప్రయాణం చేయాలి అనుకుంటే సుమారు 6 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణానికి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. బెర్త్ సెలెక్షన్ విషయాలోనూ తీవ్రమైన పోటీ ఉంటుంది. ముందుగా ఫ్లాన్ చేసుకుంటే నచ్చిన బెర్తును పొందే అవకాశం ఉంటుంది. సో.. మీరు కూడా ప్రపంచ యాత్ర చేయాలని భావిస్తే, ఈ ట్రైన్ జర్నీ చేసేయండి సరిపోతుంది.
Read Also: దేశంలో తొలి ఏసీ రైలు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? చల్లదనం కోసం ఏం చేసే వారంటే..