Singer Kalpana.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యం. ఒకసారి చేతినిండా వరుస సినిమాలు ఊపిరి సడలింపలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరొకసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర కూడా లభించదు. అలాంటి సమయంలోనే ఆర్టిస్టులు డిప్రెషన్ కి లోనవుతారు. చేతిలో డబ్బు లేక.. చేద్దామంటే అవకాశాలు లేక ఆర్థికంగా దిగజారిపోతారు. అలాంటి సమయంలో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా కొంతమంది మరణించారు కూడా. అయితే ఇప్పుడు ఇలాంటి కోవలోకే ప్రముఖ సింగర్ కల్పనా (Kalpana ) కూడా వచ్చి చేరింది. అవకాశాలు లేక అటు ఆర్థిక ఇబ్బందులు ఇటు మానసిక ఒత్తిడి వల్లే ఆమె నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో సింగర్ కల్పన ప్రాణాలతో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నారు.
గతంలోనే ఆత్మహత్యఆలోచనలు..
ఇకపోతే సింగర్ కల్పనా ఆత్మహత్యాయత్నం చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఇదే విషయాన్ని స్వయంగా ఒక ఈవెంట్లో వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచింది కల్పన.గతంలో ఆ ఈవెంట్లో కల్పనా మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక పూర్తిగా డిప్రెషన్ కి లోనై, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సీనియర్ సింగర్ చిత్ర (Singer Chitra) నన్ను ఆ ఆలోచనల నుండి బయటపడేసింది. నాకు ఏదైనా కష్టం వస్తే..నా వెన్నంటే నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకోవాలన్న నా ఆలోచనల నుండి నన్ను బయటపడేసింది” అంటూ కల్పన చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా నాడు చిత్రా ప్రమేయం లేకుండా ఉండి ఉంటే.. ఎప్పుడో సింగర్ కల్పన చనిపోయేదా అంటూ అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక సింగర్ కల్0ఆ ఆత్మహత్య ఆలోచనలను విరమింపచేసిన చిత్ర.. ఆ తర్వాత ఈమెకు మలయాళం షోలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిందట. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కల్పన తన అద్భుతమైన గాత్రంతో మెప్పించి.. సత్తా చాటి విజేతగా నిలిచింది కల్పన.
సింగర్ కల్పన కెరియర్..
కల్పనా రాఘవేంద్ర.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. 30కి పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఐదేళ్లకే సింగర్ గా మారిన కల్పన, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. తమిళంలో కెరియర్ మొదలుపెట్టినా.. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ గా ఈమె మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఎంత కష్టమైన పాటనైనా సరే అలవోకగా పాడగల సత్తా ఉన్న సింగర్ గా కల్పనాకు మంచి పేరు వుంది. అంతే కాదు కష్టమైన పాటలకు బెస్ట్ అండ్ ఫస్ట్ ఛాయిస్ కూడా కల్పనా కావడం గమనార్హం. అందుకే అందరూ కల్పనాను ‘రాక్షసి’ అని ముద్దుగా కూడా పిలుచుకుంటారు. ఎంతటి కఠోరమైన పాటలను కూడా మంచినీళ్లు తాగినట్టు పాడేయగల సత్తా ఉన్న సింగర్ ఈమె. దాదాపు 15 వేలకు పైగా పాటలు పాడిన ఈమె, మూడు వేలకు పైగా షోలు చేసి అందరిని అబ్బురపరిచింది. చివరిగా శ్రీముఖి (Srimukhi ) హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కార్యక్రమంలో కల్పనా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.