BigTV English
Advertisement

Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది.. ఏంటో తెలుసా?

Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది.. ఏంటో తెలుసా?

Chiranjeevi Vishwambhara Teaser Releasing Soon: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చాలా క్లీన్ అండ్ క్వాలిటీగా తెరెక్కిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ఐదుగురు నటీమణులు నటిస్తున్నట్లు తెలుస్తోంది.


అందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ‘విశ్వంభర’లో చిరంజీవితో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇటీవల ఆమె బర్త్ డే రోజున వెల్లడించారు. ఇక ఈ నటితో పాటు మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, సురభిలు కూడా ఈ మూవీలో నటిస్తారని టాక్ నడుస్తోంది. అలాగే ఈ మూవీలో విలక్షణ యాక్టింగ్ కింగ్ రావు రమేష్ కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా సాగాయి.

ఈ మూవీలో రావు రమేష్ మెయిన్ విలన్‌గా నటించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. దీనిపై ఎలాంటి క్లారిటీ మేకర్స్ అందించలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు మరో అప్డేట్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో విశ్వంభర మూవీ టీం మెగా ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం.


Also Read: చిరు కెరీర్‌‌లో ఇదే తొలిసారి.. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని రోజులు కేటాయించాడా..?

ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ చిన్న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మేకింగ్ విజువల్స్, మెగాస్టార్ లుక్‌ను చాలా అద్భుతంగా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ చిన్న టీజర్‌తోనే సినిమా రేంజ్‌ ఏంటో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ టీజర్‌కి గానీ సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తే మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. చూడాలి మరి టీజర్ ఎలా ఉంటుందో.

ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అందువల్ల ఆ తేదీ లోపల ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ వేసి అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జూలై చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×