Sleepy After Eating: కొంత మందికి తినగానే నిద్ర వస్తుంది. ఇది ఆఫీసు, ఇంటి పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్య జీర్ణ ప్రక్రియ, అతిగా తినడం, చక్కెర స్థాయిలలో మార్పుల వల్ల వస్తుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నట్లయితే.. కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల సోమరితనాన్ని వదిలించుకోవచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం తర్వాత నిద్ర రావడం అనేది చాలా మంది ఎదుర్కునే సమస్య. ముఖ్యంగా ఆఫీసు సమయంలో నిద్ర రావడం వల్ల ఏ పని చేయాలని అనిపించదు. ఇలాంటి సమయంలో మీ పూర్తి షెడ్యూల్ కూడా మారిపోతుంది. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మీరు ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.
తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది ?
తిన్న వెంటనే నిద్ర రావడానికి గల ప్రధాన కారణం మనం తిన్నప్పడు మన శరీరం జీర్ణక్రియ జరపడానికి శక్తిని ఖర్చు చేస్తుంది. దీని కారణంగా మెదడుకు తక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా మనకు నీరసంగా అనిపిస్తుంది. మనం తినే ఆహారంలో ఎక్కువగా నూనె, హెవీ ఫుడ్ ఉన్నప్పుడు అది శరీరాన్ని బద్దకంగా చేస్తుంది. మరొక కారణం ఏమిటంటే.. మనం తియ్యటి, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తిన్న రోజు రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వల్ల మనకు నిద్ర వస్తుంది.
చిట్కాలు:
తినగానే నిద్ర రాకుండా ఉండటానికి నీరు తాగాలి. మీరు ఆఫీసులో భోజనం చేసిన తర్వాత పనికి సిద్ధమవుతున్నప్పుడు, మనకు నిద్ర రావడం ప్రారంభమవుతుంది. తిన్న తర్వాత నిద్ర రాకుండా ఉండటానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీరు లేకపోవడం వల్ల శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా ఇది నిద్రకు దారితీస్తుంది. కాబట్టి.. మీకు నిద్ర వచ్చినప్పుడల్లా పుష్కలంగా నీరు త్రాగండి. అంతే కాకుండా తిన్న తర్వాత కూడా నీరు త్రాగండి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. అంతే కాకుండా సోమరితనాన్ని తొలగిస్తుంది.
తేలికైన, సమతుల్య భోజనం తినండి:
మీరు బయటకు లేదా ఆఫీసుకు వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనానికి తేలికైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువ నూనె, ఫుడ్ తినడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మీకు నిద్ర వస్తుంది. అందుకే నిద్ర పట్టకుండా ఉండటానికి మీ ఆహారంలో కూరగాయలు, సలాడ్ , ప్రోటీన్ అధికంగా ఉండే వంటి తేలికైన , సమతుల్య భోజనాన్ని చేర్చుకోండి. ఇది శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది . అంతే కాకుండా దీనిని తినడం వల్ల కూడా మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు.
తిన్న తర్వాత కొద్దిసేపు నడవండి:
మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మాత్రం.. భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం కంటే కాసేపయినా నడవడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల మీ శరీరం చురుకుగా ఉంటుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఫలితంగా నిద్రను దూరంగా ఉంచుతుంది. కొద్దిసేపు నడిచిన తర్వాత.. మళ్ళీ మీ పనిని సరిగ్గా చేయగలుగుతారు.
కెఫిన్ మానుకోండి:
మధ్యాహ్నం టీ లేదా కాఫీ తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది. బదులుగా.. వీలైతే హెర్బల్ టీ లేదా నిమ్మకాయ నీరు త్రాగండి. ఇది మీ శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే ఈ డ్రింక్స్ మీకు ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: వేడి నీటితో స్నానం చేస్తే..జరిగేదిదే !
చిన్న విరామం తీసుకోండి:
ఒకే చోట ఎక్కువసేపు పనిచేయడం వల్ల కూడా నీరసంగా అనిపిస్తుంది. అందుకే ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి. ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.