Kalyan Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరుకి సినీ అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. హరీష్ శంకర్, సుజీత్ లు పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడమే కాదు, ఇండస్ట్రీ హిట్ కూడా ఇచ్చాడు. ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నాడో, ఇంకో ఫ్యాన్ కి తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది. అందుకే హరీష్ శంకర్… “నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది”, “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” అనే డైలాగ్స్ కి థియేటర్స్ ఊగిపోయాయి. “నేను ఆకాశం లాంటోడిని…” అని పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా నా స్టార్ పవర్ చెక్కు చెదరదు అనే డైలాగ్ చెప్తే పవన్ కళ్యాణ్ అభిమానులకి పూనకాలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ సినిమా ఒక ఫ్యాన్ గా హరీష్ శంకర్ ఇచ్చాడు. ఇప్పుడు గబ్బర్ సింగ్ ని మించి పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేయడానికి సుజిత్ లైన్ లోకి వచ్చాడు. ఓజస్ ఘంబీరగా పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ సుజిత్ OG సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏదైనా ఉందా అనే లిస్ట్ తీస్తే అందులో OG ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అన్నౌన్స్మెంట్ నుంచే స్కై హై బజ్ ని మైంటైన్ చేస్తున్న OG బయటకి వస్తే ఒక్క డే 1 రికార్డ్ కూడా మిగలదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి అంటే సుజిత్ ఎలాంటి అంచనాలు సెట్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. కేవలం ఒక్క గ్లింప్స్ తో సుజిత్, తన ఫానిజం ఏంటో, దాని రేంజ్ ఏంటో చూపించాడు.
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్, సుజిత్ లాంటి ఫ్యాన్ ఇంకొకరు బయటకి వచ్చారు. మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మ్యాడ్ స్క్వేర్ తో ఇంకో సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అయిన కళ్యాణ్ శంకర్… తను డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. శంకర్ అయిన తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం వలన… ‘కళ్యాణ్’ శంకర్, ‘కళ్యాణ్’ శంకర్ అని ఫ్రెండ్స్ పిలిచే వాళ్లు. అప్పటినుంచి అది అలా కంటిన్యు అవుతూనే ఉంది.
భీమ్లా నాయక్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ దూరం నుంచి చూసాను, ప్రొడ్యూసర్ పరిచయం చేస్తాను అన్నాడు కానీ ఒక డైరెక్టర్ గానే కథ చెప్పడానికే పవన్ కళ్యాణ్ ని కలవాలి అనుకున్నాను, ఆయన్ని దగ్గర నుంచి కూడా చూడలేదు అని చెప్పాడు. కళ్యాణ్ శంకర్ మాటలు విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్… ఇతను మనకంటే పెద్ద ఫ్యాన్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ శంకర్ కలిస్తే ఎలాంటి కథ చెప్తాడు? అసలు ఎప్పుడు కలుస్తాడు అనేది చూడాలి.