ఒకప్పుడు పెళ్లిళ్లు అనేవి పెద్దలు చూసి ఓకే చేస్తే అయ్యేవి. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. యువతీ యవకులు చాలా అప్ డేట్ అయ్యారు. పెద్దలు.. పెళ్లి చూపులు.. నిశ్చితార్థం.. పెళ్లి.. అనేవి పాత చింతకాయ పచ్చడిలా భావిస్తున్నారు. తమకు నచ్చిన జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. స్నేహం, ప్రేమ, లివింగ్ రిలేషన్ షిప్ అంటూ రకరకాల వేషాలు వేస్తున్నారు. నచ్చితే, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. నచ్చకపోతే సింఫుల్ గా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు అన్నీ , యువకులే తీసుకుంటున్నారు. ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే, సింఫుల్ గా తల్లిదండ్రులకు ఓ మాట చెప్తున్నారు. నచ్చితే పెళ్లి చేయండి, లేదంటే మా జీవితాన్ని మేం చూసుకుంటాం అంటున్నారు.
రియల్ లైఫ్ ‘పరుగు’!
తెలుగులో అల్లు అర్జున్ హీరోగా ‘పరుగు’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలోనూ ఇలాంటి కథే ఉంది. పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని ప్రేమించిన అమ్మాయిని లేవదీసుకు పోయే కుర్రాళ్ళదా తప్పు? లేకపోతే వారి ప్రేమను గుర్తించని తల్లితండ్రులదా? అనే సమకాలీన సామాజిక సమస్యను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఆ యువకుడు, ఆ యుకుడితో తన కూతురు ఎక్కడ లేచిపోతుందోనని ఆ తండ్రి పడే వేదనను ఇందులో అద్భుతంగా చూపించారు. తాజాగా ‘పరుగు’ సినిమా లాంటి ఘటన రియల్ లైఫ్ లోనూ జరిగింది. అయితే, ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో.
కాళ్లు పట్టుకున్నా కనికరించని యువతి
తమిళనాడుకు చెందిన ఓ యువతికి, ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా, ప్రేమగా మారింది. ఇద్దరూ మేజర్లే. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. అబ్బాయి ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. కారణాలు ఏంటో తెలియదు కాదు. అమ్మాయి తండ్రి వీళ్ల ప్రేమను ఒప్పుకోలేదు. అయినప్పటికీ అమ్మాయి పట్టువీడ లేదు. ఇష్టపడిన వాడు కావాల్సిందే అని పట్టుబట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, ముక్కూ, ముఖం తెలియని వాడితో ఎలా ఉంటుందో? అని బెంగపెట్టుకున్నాడు. అంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేస్తామని అమ్మాయికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఇలాగే బుజ్జగించారు. అమ్మాయి పట్టించుకోలేదు. పెళ్లి చేస్తే ఒకే. లేదంటే ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతానని తెగేసి చెప్పింది. చెప్పడమే కాదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయితో కలిసి వెళ్లిపోయేందు రెడీ అయ్యింది. ఆమె తండ్రి వెనుకాలే వస్తూ ఎంత వద్దని వారించినా, ఆమె ససేమిరా అన్నది. తండ్రి కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఆమె కనికరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతగా బాధపడటం ఎందుకు, ప్రేమించిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుందిగా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది తండ్రి నిస్సహాయతను చూసి జాలిపడుతున్నారు.
https://www.instagram.com/bigtv_telugu/reel/DHfZm9EClhm/
Read Also: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!