BigTV English

Komatireddy Venkat Reddy: పదేండ్ల బాగోతం.. మీరు రోడ్లు వేశారా.. కోమటిరెడ్డి సీరియస్

Komatireddy Venkat Reddy: పదేండ్ల బాగోతం.. మీరు రోడ్లు వేశారా.. కోమటిరెడ్డి సీరియస్

2008లో రాజీవ్ రహదారి (శామీర్‌పేట్-రామగుండం), నార్కట్‌పల్లి-అద్దంకి, మేదరమెట్ల రోడ్లు పీపీపీలో నిర్మితమయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం హ్యామ్ (HAM) మోడల్‌పై ఆలోచిస్తున్నామని, దీన్ని 2016లో NHAI (నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టిందనీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. మహారాష్ట్ర రెండు దశలను పూర్తి చేసి, మూడో దశలో ఉందన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో CRMP (కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం) పేరుతో హ్యామ్ లాంటి మోడల్‌లో రోడ్లు నిర్మించిందని చెప్పారు. అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము వచ్చిన తర్వాత రూ.850 కోట్ల రూపాయలను CRIF క్రింద తీసుకొచ్చామన్నారు. దీంతో 435 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే రూ. 4 వేల కోట్ల రూపాయల మంజూరీలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పదేళ్లలో నిర్మించిన రోడ్లను తాము ఏడాది కాలంలోనే చేస్తున్నాం కోమటిరెడ్డి అన్నారు.


‘గ్రామీణ, రాష్ట్ర రహదారులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టోల్ ఫీజు వసూలు ప్లాన్ చేస్తుంది. ఈమేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే టోల్ నిర్వహణకు టెండర్లను కూడా పిలవనుంది అని.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి చెక్ పెట్టారు. అవన్నీ అవాస్తవేలనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడానికే కొందరు ఈ ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు విధించాలన్న ఆలోచన కూడా తమకు లేదని తేల్చి చెప్పారాయన. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40శాతాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆరు లేదా మూడు నెలలకు కాంట్రాక్టర్లకు ఈ చెల్లింపులు చేస్తున్నామని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Also Read: హైదరాబాద్‌లో ఢిల్లీ లిక్కర్‌.. రూ.22లక్షల మద్యం స్వాధీనం

‘‘ప్రతిగ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తున్నాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారు. ఆ మూడు చోట్ల రోడ్లు వేయడానికి ఆఖరికి సింగరేణి నిధులను కూడా వాడేశారని ఫైర్ అయ్యారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా కలియతిరిగి చూద్దామా హరీష్’’ అని సవాల్ విసిరారు కోమటిరెడ్డి. మేధావి హరీష్ నీకే వదిలేస్తున్నా అంటూ కోమటిరెడ్డి మాస్ ర్యాగింగ్ చేశారు. కాగా మంత్రి ఛాలెంజ్‌ను మాజీ మంత్రి హరీస్ రావు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు బయటకు తీద్దామని, రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని హరీష్ సూచించారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×