Ravi Teja: ఒకప్పుడు చాలామంది హీరోలకు మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ అయితే. ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోలు చాలామందికి మాస్ మహారాజా రవితేజ ఇన్స్పిరేషన్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రవితేజ ఆ తర్వాత నటుడుగా చిన్న చిన్న పాత్రలలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న తరుణంలో దర్శకుడు పూరి జగన్నాథ్ నీతో నేను సినిమా చేస్తాను అని చెబుతూ ఉండేవాడు. పూరి జగన్నాథ్ కేవలం కావాలనే చెబుతున్నాడు అనుకోని రవితేజ దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన మాటను వదిలేయకుండా రవితేజను హీరో చేసాడు. మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు. రవితేజ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన సినిమాలు మాత్రం ప్రత్యేకమని చెప్పాలి.
ఇక ప్రస్తుతం రవితేజ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. అలా యాంటీ ఫ్యాన్స్ లేని అతి తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకరు. ఇక ప్రస్తుతం రవితేజ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. రవితేజకు హిట్టు ప్లాప్ తో సంబంధం ఉండదు. రీసెంట్ గా రవితేజ కెరియర్ లో మంచి సక్సెస్ సాధించిన సినిమా ధమాకా. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో మాస్ జాతర అనే సినిమాను చేస్తున్నాడు రవితేజ.
Also Read : Niharika: గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్.. మైలురాయి అంటూ పోస్ట్..!
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులను పరిచయం చేసిన ఘనత రవితేజకు దక్కుతుంది. రవితేజ పరిచయం చేసిన దర్శకులు నేడు సక్సెస్ఫుల్ గా మంచి స్థాయిలో ఉన్నారు. తాజాగా రవితేజకు ఇద్దరు దర్శకులు కథలను చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ, చిత్రాలహరి వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకున్న కిషోర్ తిరుమల రవితేజకు కథను చెప్పారట. ఆల్మోస్ట్ ఈ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. మ్యాడ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన కళ్యాణ్ శంకర్ కూడా రవితేజకు ఒక కథను చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కథను కూడా రవితేజ ఓకే చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏ సినిమాను మాస్ మహారాజా ముందు పట్టాలెక్కిస్తారని చాలామందికి ఆసక్తి కలుగుతుంది.దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Sai Pallavi:తండేల్ మూవీలో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ కాపీనా.. ఆ స్టెప్ నాదేనంటూ..?