Niharika:టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక అమ్మాయి నిహారిక(Niharika).. నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఈమె.. ఆ తర్వాత నాగశౌర్య(Naga shourya) నటించిన ‘ఒక మనసు’ మూవీ(Oka Manasu Movie)తో హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ నిహారిక కి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. ముఖ్యంగా నిహారిక హీరోయిన్ మెటీరియల్ కాకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చూసిన జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ని పెళ్లి చేసుకొని, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతగా మారి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది.ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న నిహారిక.. ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
గుడ్ న్యూస్ అంటున్న నిహారిక..
అలా హీరోయిన్ గానే కాకుండా కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) సినిమాను నిర్మించి, మంచి సక్సెస్ అందుకుంది. అయితే అలాంటి నిహారిక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన డ్రీమ్ నెరవేరబోతుంది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ నిహారిక చెప్పబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏంటి..? ఆమె డ్రీమ్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా డాటర్ నిహారిక (Niharika) తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీలో..” నా డ్రీమ్ త్వరలోనే నెరవేరబోతోంది.. నా యాక్టింగ్ కెరియర్ లోనే ఇది ఒక మైలురాయి.. అయితే అదేంటో మీరు మాత్రం నన్ను అడగకండి. నాతో పాటు వైబ్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వండి. ప్రస్తుతం నాకు గాలిలో తేలిపోతున్నట్టు ఎంతో సంతోషంగా ఉంది..” అంటూ నిహారిక పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఇంతకీ నిహారిక చెప్పబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏంటి..? ఆమె దేని గురించి ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది? అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. ఇంకొంత మందేమో నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆమె యాక్టింగ్ కెరీర్ లో ఇది ఒక మైలురాయి అని పోస్ట్ చేయడంతో సినీ కెరీర్ కి సంబంధించి నిహారిక ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతోందా..? ఎవరైనా పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుందా..? అందుకే తన డ్రీమ్ నెరవేరబోతుంది అని పోస్ట్ చేసిందని అనుకుంటున్నారు.
మద్రాస్ కారన్ తో మంచి గుర్తింపు..
మరి నిహారిక(Niharika) చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక నిహారిక రీసెంట్ గా తమిళ మూవీ మద్రాస్ కారన్ (Madras kaaran)లో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇందులో నిహారికని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు నిహారిక ఏ సినిమాలో కూడా నటించనంతగా ఈ సినిమాలో నటించింది.షేన్ నిగమ్ తో నిహారిక చేసిన రొమాన్స్ వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.