Cameron Green: ఆస్ట్రేలియా డేంజర్ ప్లేయర్ , RCB మాజీ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు కామెరాన్ గ్రీన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. అందరినీ సర్ ఫ్రైజ్ చేశాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆస్ట్రేలియా డేంజర్ ప్లేయర్ , RCB మాజీ ప్లేయర్ కామెరాన్ గ్రీన్, తన ప్రియురాలు… ఎమిలీ రెడ్‌వుడ్ ( Emily Redwood ) ఇద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. తాజాగా ఎమిలీ రెడ్‌వుడ్, కామెరాన్ గ్రీన్ ఇద్దరూ ఎంగేజ్ మెంట్ ( Cameron Green engagement ) చేసుకున్నారు. ఈ తరుణంలోనే… ఓ డైమండ్ రింగ్ ను ఎమిలీ రెడ్‌వుడ్ కు కామెరాన్ గ్రీన్ తొడిగాడు.
Also Read: ICC Champions Trophy: 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ..ఇంత గ్యాప్ రావాడానికి కారణాలు ఇవే ?
ఈ సందర్భంగా దిగిన ఫోటోలు షేర్ చేశాడు కామెరాన్ గ్రీన్. తన ప్రియురాలు ఎమిలీ రెడ్‌వుడ్ తో అడుగులు వేయబోతున్నట్లు ఈ సందర్భంగా పోస్ట్ పెట్టాడు గ్రీన్. దీంతో… ఎమిలీ రెడ్‌వుడ్ గురించి గ్రీన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో…. ఎమిలీ రెడ్‌వుడ్, కామెరాన్ గ్రీన్ లకు శుభాకాంక్షలు చెబుతున్నారు ఫ్యాన్స్. అటు ఆస్ట్రేలియా క్రికెటర్లు, RCB అభిమానులు కూడా… ఎమిలీ రెడ్‌వుడ్, కామెరాన్ గ్రీన్ లకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా 1999 సంవత్సరంలో పుట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్… 2020 సంవత్సరంలో ఆస్ట్రేలియా నేషనల్ టీం లోకి వచ్చాడు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి… ఇప్పుడు దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో… కీలక ప్లేయర్ గా కూడా మారిపోయాడు గ్రీన్. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడమే కాకుండా… 150 కిలోమీటర్ల వేగంతో బంతులు కూడా విసరగలడు గ్రీన్. అంటే ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో మొదట్లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడాడు గ్రీన్. అయితే కొంతమంది ప్లేయర్లను మార్చుకున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో ఆడాడు. అయితే ఈసారి.. మెగా వేలంలో పాల్గొనకుండా… దూరంగా ఉన్నాడు ప్రస్తుతం గ్రీన్.. బ్యాక్ పెయిన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడట. అందుకే ఐపిఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనలేదు.
వాస్తవంగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఎప్పుడూ కూడా పెద్దగా రాణించలేదు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడినప్పుడు పేలలేదు. ఆ తర్వాత.. బెంగళూరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. దీంతో.. RCB మాజీ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో… బ్యా క్ పేయిన్ పేరుతో వేలానికి దూరంగా ఉన్నాడు. ఇక అటు ఆస్ట్రేలియా టీంలో మాత్రం RCB మాజీ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ బాగానే రాణిస్తున్నాడు. ఇక తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుని.. గుడ్ న్యూస్ చెప్పాడు.
Also Read: Telugu Warriors: పప్పులో కాలేసిన అయ్యగారు..12 మంది ప్లేయర్లతో ఆడించాడు..!
Congratulations to Cameron Green and his partner, Emily Redwood, on their engagement! 💍✨❤️
Wishing them a lifetime of love and happiness! 💕🥂#CameronGreen #Australia #Cricket #Sportskeeda pic.twitter.com/Ktc8faIqlZ
— Sportskeeda (@Sportskeeda) February 16, 2025