Sai Pallavi:ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ అబ్బురపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి అనగానే ఆమె డాన్స్ మాత్రమే మనకు గుర్తుకొస్తుంది అంటే ఇక తన డాన్స్ తో అందరిని ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈమె నటించే ప్రతి సినిమాలో కూడా ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలోకి రాకముందు ‘ఢీ’ లో పాల్గొని విజేతగా నిలిచిన సాయి పల్లవి.. ప్రస్తుతం సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ బిజీగా మారింది. శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో పక్కా తెలంగాణ అమ్మాయిలా నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని రూపొందించిన ‘తండేల్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తండేల్ మూవీలో సాయి పల్లవి వేసిన స్టెప్స్ కాపీనా?
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి నటన ఏ విధంగా అయితే హైలైట్ అయిందో.. ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే హైలెట్ అయింది. ముఖ్యంగా ఈమె వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ కుమార్ (Dinesh Kumar) అందించిన స్టెప్స్ కి సాయి పల్లవి పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా బుజ్జి అనే ఒక బెంగళూరుకు చెందిన వ్యక్తి.. సాయి పల్లవి చేసిన డాన్స్ స్టెప్పులు తనవే అంటూ మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. దినేష్ కుమార్ కొరియోగ్రఫీ అందించిన స్టెప్ లలో సాయి పల్లవి వేసిన డాన్స్ స్టెప్స్ తనవే అంటూ ఒక వ్యక్తి తెలిపారు.
ఆ స్టెప్స్ నావే అంటున్న బుజ్జి..
ఆయన మాట్లాడుతూ.. “నా పేరు బుజ్జి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. హాయ్ రమేష్ బుజ్జి అనే ఇంస్టాగ్రామ్ పేజ్ లో 10 సంవత్సరాల క్రితమే ఇప్పుడు తండేల్ మూవీలో సాయి పల్లవి వేసిన స్టెప్స్ ని వేశాను. సాయి పల్లవి చేతితో తిప్పుతూ చేసిన స్టెప్స్ ను నేను చేశాను. అవి కాపీ కొట్టారు. కావాలంటే మీకు వీడియో కూడా చూపిస్తాను. ఆ స్టెప్పే ఇప్పుడంతా వైరల్ అవుతోంది.దయచేసి నాకు న్యాయం కావాలి. ఆ స్టెప్స్ నావే. కావాలంటే నేను చెప్పిన ఇన్ స్టా పేజ్ లోకి వెళ్లి చూడండి. రెండు సంవత్సరాల క్రితమే ఆ స్టెప్స్ నేను పెట్టాను. చూస్తే మీకే తెలుస్తుంది. మనం వచ్చి ఏదో మైక్ ముందు మాట్లాడడం కాదు. నిజం ఉండాలి.. ప్రజలు తెలుసుకోవాలి. అందులో నాది ఒక స్టెప్ ఉంది. నా స్టెప్ ను వాళ్ళు కాపీ చేశారు” అంటూ అతడు తెలిపారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి వేసిన డాన్స్ స్టెప్ కాపీ అంటూ వస్తున్న వార్తలపై పలు కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై ఇటు కొరియోగ్రాఫర్, అటు సాయి పల్లవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
తండేల్ మూవీ విశేషాలు..
గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి తో చేసిన సినిమా తండేల్. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు(Bunny vasu) నిర్మించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో అటు సాయి పల్లవి, ఇటు నాగచైతన్య ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక చందు మొండేటి (Chandu Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు .
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">