Kamakshi Bhaskar:కామాక్షి భాస్కర్ (Kamakshi bhaskar).. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, డాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈమె.. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆరు సంవత్సరాల పాటు వైద్య విద్య కోసం కష్టపడి.. చదువు పూర్తయిన తర్వాత ఒకవైపు వైద్య వృత్తికి సంబంధించి ప్రాక్టీస్ కొనసాగిస్తూనే.. మరొకవైపు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు డాక్టర్ గా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న మీనాక్షి భాస్కర్.. ఇటు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా, డైరెక్టర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడంతో ఈమె టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. అటు నిర్మాతగా కూడా ఒకటి రెండు చిత్రాలను నిర్మించి సక్సెస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
వారిని చూసి ఇన్స్పైర్ అయ్యా- కామాక్షి భాస్కర్..
ఇక అందులో భాగంగానే మీ జర్నీ ఎలా సాగింది అని ప్రశ్నించగా.. కామాక్షి మాట్లాడుతూ.. “నేను చిన్నప్పటి నుంచి నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. స్కూల్లో టీచర్లకు నేను ఫేవరెట్ స్టూడెంట్ ని. వారు ఎంత కష్టపడి చదవమంటే అంత కష్టపడి చదివేదాన్ని. వారి వెనకాల పుస్తకాలు మోసుకుంటూ వెళ్లే దాన్ని. ఒక 20 నుండి 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. కష్టమైనా.. నష్టమైనా.. సంతోషమైన ఇతరులతో పంచుకోవడానికి కాస్త ఆలోచించేదాన్ని. కాలేజ్ కి వెళ్లే సమయంలో కూడా ఇల్లు, కాలేజ్ ఇంతే నాకు తెలిసిన ప్రపంచం. పైగా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా ప్రపంచం నేను అన్నట్టుగా బ్రతికే దాన్ని. అయితే ఒక్కసారిగా ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది. అక్కడే నా ఆలోచన నన్ను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), ప్రియాంక చోప్రా(Priyanka Chopra), లారాదత్త (Lara Dutta), సుస్మితాసేన్ (Susmita Sen) వంటి వారు తమను తాము ప్రూవ్ చేసుకొని, ఇతర మహిళలను కూడా ఎంకరేజ్ చేసేవారు. ఇక అప్పుడే నాకనిపించింది. నేను కూడా ఆ పొజిషన్లో ఉండాలి. నాలాగా తమ అభిప్రాయాలను బయటకి చెప్పుకోలేని అమ్మాయిలకు అండగా నిలవాలి అని నేను కూడా అనుకున్నాను. ఇక అలా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా మారుతూ వచ్చాయి” అంటూ కామాక్షి తెలిపింది.
చైనాలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నాను…
ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడుకుందామని యాంకర్ అడగగా.. “నాకు కూడా తెలుగు మాట్లాడాలని ఉంటుంది. కాకపోతే 6 సంవత్సరాలు చైనాలో ఉండిపోయాను. ఆ చైనాలో దాదాపు 130 దేశాలకు చెందిన వారితో కలిశాను. కాబట్టి అక్కడ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నాకు అదే అలవాటైపోయింది. నా బ్రెయిన్ కూడా అనుకూలంగా ఉండే లాంగ్వేజ్ ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తోంది. పైగా ఇంగ్లీషు మాట్లాడడం అలవాటు పడిన తర్వాత తెలుగు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. తెలుగు మాట్లాడిన రెండు పదాల తర్వాత వెంటనే ఇంగ్లీష్ పదం వచ్చేస్తోంది”. అంటూ తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా చైనా లో చిత్ర విచిత్ర వంటకాలు తింటారట.. మీరు కూడా తిన్నారా? అని అడగ్గా..” ట్రై చేశాను” అంటూ మీనాక్షి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా “బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూసాను. అయితే కేవలం అత్యుత్సాహం కారణంగానే వాటిని రుచి చూశాను” అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి.. తెలుగు ఇళ్లలో బొద్దింకలకు, తేళ్లకు ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. కనిపిస్తే చాలు వెంటనే చంపేయాలి అని కొంతమంది ఆలోచిస్తుంటే.. వాటిని చూస్తేనే పారిపోయే జనాలు కూడా ఉన్నారు. అలాంటిది ఈమె ఏకంగా రుచి చూసాను అని చెప్పడంతో నెటిజెన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ మీరు చాలా సాహసం చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.