BigTV English

Kamal Haasan : జగమొండి… ఈగోతో సినిమానే రిలీజ్ చేయడం లేదు!

Kamal Haasan : జగమొండి… ఈగోతో సినిమానే రిలీజ్ చేయడం లేదు!

Kamal Haasan :కమలహాసన్ (Kamal Haasan) చేస్తున్న పనులను బట్టి చూస్తుంటే.. జగమొండి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆయనకి ఉన్న ఈగో కారణంగా ఇప్పుడు డబ్బు కూడా నష్టపోతున్నా..ఆయన మాత్రం తన పంతాన్ని వీడడం లేదు అని స్పష్టం అవుతోంది..తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని ఎట్టకేలకు దిగివచ్చి కన్నడిగులకు క్షమాపణలు చెప్పిన కమలహాసన్.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన సినిమా ‘థగ్ లైఫ్’ ను కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ఈ సినిమా విడుదల చేస్తే మహా అంటే రూ.1 నుండి రూ.5 కోట్లు మాత్రమే వస్తాయి. ఈ మొత్తం తన కసలు నష్టమే కాదు అని ఆలోచించారో ఏమో అందుకే ఇప్పుడు కమలహాసన్ తన మూవీని కర్ణాటకలో విడుదల చేయడం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కమలహాసన్ తీరుకి జగమొండి.. ఎవరిమాటా వినడు కదా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


కమలహాసన్ భవిష్యత్తును ఆలోచించడం లేదా?

ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. ఈ ఒక్క సినిమాకు రూ.1 – రూ.5 కోట్లు.. కానీ, ఇది ఈ ఒక్క సినిమాతోనే ఆగిపోదు కదా.. ఆయన హీరోగా వచ్చే ఏ సినిమా కూడా కన్నడలో ఆడకపోవచ్చు. మరి కమలహాసన్ ఈ నిర్ణయాన్ని మార్చుకుంటారా? భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా? అనే విషయం కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. ఏది ఏమైనా కమలహాసన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.


ALSO READ: Film industry: మీకు స్టార్ స్టేటస్ కావాలా? అయితే ఈ డైరెక్టర్ చేతిలో చెంప దెబ్బ తినండి చాలు!

అసలు ఎక్కడ మొదలైంది ఈ వివాదం?

కమలహాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Siva Raj Kumar) కూడా హాజరయ్యారు. అయితే ఈ వేదికపై కమలహాసన్ “తమిళం నుండి కన్నడ పుట్టింది” అని కామెంట్లు చేసి, కన్నడిగుళ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కన్నడిగుళు వెంటనే బహిరంగంగా కమలహాసన్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమలహాసన్ “ప్రేమతో అన్న మాటలు కాబట్టి అలాంటి మాటలకు నేను క్షమాపణలు చెప్పను” అని అన్నారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన కన్నడిగుళు..” క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని, బ్యాన్ చేస్తామని” బెదిరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు కమలహాసన్. తన పిటీషన్ లో తన సినిమా విడుదలకు అడ్డుకుంటున్నారని పలు చర్యలు తీసుకోవాలని కోరగా హైకోర్టు కమలహాసన్ కి గట్టి షాక్ ఇచ్చింది. క్షమాపణలు చెప్పాలని కోరింది. ఇక దీంతో కమలహాసన్ క్షమాపణలు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన ఈగో హర్ట్ అవ్వడం వల్ల తన సినిమాను విడుదల చేయడం లేదని సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×