కొన్ని క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల గురించి మనం ఇప్పటికీ మాట్లాడుతుంటాం అలాంటి కాంబో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఏస్ డైరెక్టర్ మణిరత్నం. వీరిద్దరూ కలిసి సినిమా చేసి 35 ఏళ్లు అయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానుంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించనున్నారు. కమల్, మణిరత్నం కాంబోలో చివరగా వచ్చిన సినిమా నాయగన్. ఆ సినిమా వచ్చి 35 ఏళ్లు అయ్యింది. అదొక క్లాసిక్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా రానుంది. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ , శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.