Big Stories

Munugodu Counting : ప్రారంభమైన మునుగోడు ఓట్ల లెక్కింపు..

Munugodu Counting : మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. నల్లగొండ అర్జాలబావిలోని వేర్‌హౌస్‌ కార్పొరేషన్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రంలో మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కోసం 21 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

- Advertisement -

మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. చౌటుప్పల్‌ తర్వాత తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కౌంటింగ్‌ జరగనుంది. ఈ మండలంలో 58 బూత్‌ల ఓట్లు లెక్కింపు ఒకే రౌండ్‌లో పూర్తి కానుంది. మునుగోడు మండలంలో 44 బూత్‌ల ఓట్ల లెక్కింపు 2 రౌండ్లలో ముగియనుంది. ఆ తర్వాత చండూరు మండంలోని 40 బూత్‌ల ఓట్ల లెక్కింపు 2 రౌండ్లలో పూర్తవుతుంది. మర్రిగూడ మండలంలోని 33, నాంపల్లి మండలంలోని 43, గట్టుప్పల్ మండలంలో 16 బూత్‌ల కౌంటింగ్‌ 5 రౌండ్లలో ముగియనుంది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు..చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రకటించనున్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్​వైజర్​, అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News