World Cup 50 Anniversary| క్రికెట్ వరల్డ్ కప్ సరిగ్గా ఏళ్లు పూర్తయ్యాయి. 1975లో క్రికెట్ వరల్డ్ కప్ మొదలైంది, ఈ ఏడాది అంటే 2025లో 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1964లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్థాపించబడింది. 1971లో క్రికెట్ కౌన్సిల్ మొదటి క్రికెట్ వరల్డ్ కప్ గురించి ప్రతిపాదించగా.. అది 1975లో నిజం అయింది. మొదటి మూడు వరల్డ్ కప్‌లు ఇంగ్లండ్‌లో జరిగాయి. ఆ మ్యాచ్‌లు 60 ఓవర్లతో, ఎరుపు బంతితో, తెల్లని దుస్తుల్లో ఆడారు. ఆ సమయంలో దీన్నిప్రుడెన్షియల్ కప్ అని పిలిచే వారు.
మొదటి వరల్డ్ కప్ 1975 జూన్ 7 నుంచి 21 వరకు జరిగింది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా.
మొదటి మ్యాచ్: భారత్ vs ఇంగ్లండ్
జూన్ 7, 1975న లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ డెన్నిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ మదన్ లాల్ మొదటి బంతి వేశాడు, అదే వరల్డ్ కప్‌లో మొదటి బంతి. ఇంగ్లండ్ ఓపెనర్ డెన్నిస్ అమెస్ 137 పరుగులతో వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ చేశాడు. భారత బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ 36 పరుగులు చేశాడు, కానీ ఇంగ్లండ్ 202 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
ఫైనల్‌లో వెస్టిండీస్ విజయం
వెస్టిండీస్ జట్టు మొదటి వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించారు. వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ సెంచరీతో జట్టును విజయం వైపు నడిపించాడు. అతను ట్రోఫీతో ఉన్న ఫోటో ఇప్పటికీ ఫేమస్.
భారత జట్టు ప్రయాణం
ఇంగ్లండ్‌తో ఓడిపోయిన తర్వాత, భారత్ తమ రెండవ మ్యాచ్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో ఆడింది. భారత బౌలర్లు ఈస్ట్ ఆఫ్రికాను 120 పరుగులకే కట్టడి చేశారు. బిషన్ సింగ్ బేడీ 12 ఓవర్లలో 6 వికెట్లు తీశాడు. సునీల్ గవాస్కర్, ఫరూఖ్ ఇంజనీర్‌లు ఓపెనింగ్ చేసి.. లక్ష్యాన్ని సులభంగా చేజ్ చేశారు.
గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడింది. ఇది గెలవాల్సిన మ్యాచ్. ఆ రోజు భారత బ్యాటర్ అబిద్ అలీ 71 పరుగులు చేయగా, భారత్ 230 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని సులభంగా చేజ్ చేసింది. దీంతో భారత్ నాకౌట్ దశకు చేరలేక, గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన కొహ్లీ
ఈ మొదటి వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి. 50 ఏళ్ల తర్వాత కూడా ఆ రోజులు, ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.