BigTV English

Kamal Haasan: తమిళం నుంచే కన్నడ పుట్టింది.. కమలహాసన్ వ్యాఖ్యలపై కర్ణాటకలో దుమారం..!

Kamal Haasan: తమిళం నుంచే కన్నడ పుట్టింది.. కమలహాసన్ వ్యాఖ్యలపై కర్ణాటకలో దుమారం..!

Kamal Haasan: విశ్వనటుడు కమలహాసన్ (Kamal Haasan) దాదాపు 38 ఏళ్ల తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam ) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా కమలహాసన్ కన్నడ భాషను ఉద్దేశించి, చేసిన కామెంట్లు ఇప్పుడు కన్నడిగుల ఆగ్రహానికి గురవుతున్నాయి. కమలహాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో నిన్న రాత్రి చెన్నైలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలహాసన్ మాట్లాడుతూ.. “తమిళం నుంచి కన్నడ పుట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజు కుమార్ (Shivaraj Kumar)కూడా హాజరయ్యారు. పైగా ఆయన ముందే కమలహాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.


కన్నడ భాషను అవమానపరిచిన కమలహాసన్..

కమలహాసన్ మాట్లాడుతూ..” నా జీవితం, నా బంధం అన్ని తమిళమే” అని పదాలతో తన స్పీచ్ ప్రారంభించిన కమలహాసన్ శివరాజ్ కుమార్ ని చూస్తూ.. “ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే శివరాజ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం తమిళ్ అని మొదలు పెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది. కాబట్టి మీరు కూడా దానిలో భాగమే” అని అన్నారు కమలహాసన్.


కమలహాసన్ ఒక సంస్కారం లేని వ్యక్తి..

అయితే ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. కమలహాసన్ మాటలపై ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప మాట్లాడుతూ.. కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ఒక సంస్కారం లేని వ్యక్తి అని, కన్నడ భాషను అవమానించారని, మాతృభాషను ప్రేమించడం మంచిదే కానీ ఇతరుల భాషను అవమానించడం సంస్కారం కాదు.. కన్నడ సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమలహాసన్ తన ప్రసంగంలో ఇలా ఒక భాషను కించపరుస్తూ మాట్లాడడం పద్ధతిగా లేదు” అంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు శివరాజ్ కుమార్ ను ఎదురుగా పెట్టుకుని.. కన్నడ భాషను అవమానించడమే కాదు అహంకారం ఉన్నట్టు స్పష్టం అవుతుంది అంటూ ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయంపై కర్ణాటకలో కమలహాసన్ పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్..

ఇకపోతే దక్షిణాదికి సామరస్యాన్ని తీసుకురావాల్సిన కమలహాసన్ గత కొన్నేళ్లు గా హిందూ మతాన్ని అవమానిస్తూ.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు. కాబట్టి కన్నడిగులకు వెంటనే కమలహాసన్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆయన వ్యక్తిత్వం అవిధేయతతో నిండిపోయింది. కన్నడిగుల ఔదార్యాన్ని మర్చిపోయారు అంటూ కమలహాసన్ పై మండిపడ్డారు.

ALSO READ:Kollywood: విజయ్ దళపతి నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×