Trump Govt: అమెరికాలో ఉన్నవారిని వారి వారి దేశాలకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ట్రంప్ సర్కార్. ఓవైపు ఉద్యోగులు, మరో సీనియర్ సిటిజన్లు, ఇప్పుడు స్టూడెంట్స్ వంతైంది. ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపి వేయాలని రాయబారి కార్యాలయాలను ఆదేశ విదేశాంగ మంత్రి ఆదేశించారు.
ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చదివేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు ఆదేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సోషల్‌మీడియా ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాయబారి కార్యాలయాలు ఎలాంటి వీసా అపాయింట్ మెంట్లను అనుమతించవన్నారు. ఇప్పటివరకు బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం సాగుతాయని తెలిపారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి పెట్టడంతో విదేశీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
యూఎస్‌లో తమ భవిష్యత్తు గురించి అప్పుడే ఆందోళనలో పడ్డారు. వీసా సమయంలో ఇలాంటి ఆంక్షలు ఉంటే, అక్కడికి వెళ్లిన తర్వాత ఇంకెన్ని సమస్యలు ఉత్పన్నమవు తాయోనని చర్చ మొదలైపోయింది. ఈ లెక్కన స్టూడెంట్స్ వీసా నిబంధనలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది ట్రంప్ సర్కార్.
ALSO READ: అమెరికా హెచ్చరికలు.. అలా చేస్తే వీసా క్యాన్సిల్, విద్యార్థుల్లో టెన్షన్
జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని అంతర్జాతీయ విద్యార్థులపై అనేక ఆరోపణలు చేస్తోంది ట్రంప్ సర్కార్. ఈ విషయంలో యూనివర్సిటీలతో గొడవ తీవ్రమైంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేసింది. దీంతో ప్రభుత్వానికి-యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న గొడవ రెట్టింపుకానుంది.
ఈ పరిస్థితి తొలుత హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మరింత తీవ్ రూపం దాల్చింది. దేశంలోని ఎవరు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నారు? అలాంటి అంశాలు తెలుసుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది. అయితే ట్రంప్ చర్యలను చాలామంది తప్పుబడుతున్నారు.
ట్రంప్ నిర్ణయం వల్ల యూనివర్సిటీల విద్య దిగజారే ప్రమాదం ఉందని అంటున్నారు. వీసా దరఖాస్తులను నిలిపివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ప్రతిభావంతులను ఆకట్టుకోవడం ద్వారా తమ ర్యాంకులను పెంచుకునేందుకు అమెరికా విద్యాసంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు ఇబ్బందిగా మారనుంది.
అమెరికాలో యూనివర్సిటీ విద్య చదువుతున్నారు 19 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో విదేశీ విద్యార్థులు దాదాపు 6 శాతంగా ఉంది. రెండేళ్ల కిందట 1.1 శాతం మిలియన్ల విదేశీ విద్యార్థులు అమెరికాకు వచ్చారు. అందులో భారత్ నుంచి వెళ్లినవారే ఎక్కుమంది ఉన్నారు. ఆ తర్వాత చైనా విద్యార్థులు ఉన్నారు.
యూఎస్‌కు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంజినీరింగ్ కోర్సు ఎంచుకున్నారు. ఆ దేశ నివేదికల ప్రకారం .. న్యూయార్క్ విశ్వవిద్యాలయం, నార్త్ఈస్టెర్న్ విశ్వవిద్యాలయం, కొలంబియా వర్సిటీలు అత్యధిక విదేశీ విద్యార్థులను కలిగి ఉన్నట్లు చెబుతున్నాయి.