BigTV English

Monsoon Destinations: మాన్ సూన్ మాయాజాలంలో మైమరచిపోవాలా? ఈ ప్లేసేసెస్ కు కచ్చితంగా వెళ్లాల్సిందే!

Monsoon Destinations: మాన్ సూన్ మాయాజాలంలో మైమరచిపోవాలా? ఈ ప్లేసేసెస్ కు కచ్చితంగా వెళ్లాల్సిందే!

ఎండాకాలం భానుడి భగభగలతో సతమతం అయిన ప్రజలకు రుపతనాలు ఉపశమనాన్ని మోసుకొస్తాయి. అప్పటి వరకు మూసుకుపోయి మూలకు ఉన్న గొడుగులు విప్పుకుని వీధుల్లో తిరుగుతాయి. వర్షాకాలం మొదలయ్యే సమయంలో ప్రకృతి పచ్చని చీరకట్టుకుని, అత్యంత మనోహరంగా ఆకట్టుకుంటుంది. పొగమంచుతో కూడిన ఉదయాలు, పచ్చని కొండల నడుము వేడి వేడి చాయ్ ని ఇష్టపడే వాళ్లు.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య పర్యాటించాల్సిన అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


రుతుపవనాల వేళ సందర్శించాల్సిన ప్రదేశాలు

⦿ మహాబలేశ్వర్, మహారాష్ట్ర


పశ్చిమ కనుమలలో ఉన్న ఈ హిల్ స్టేషన్ రుతుపవనాల వేళ అద్భుతంగా కనువిందు చేస్తుంది. స్ట్రాబెర్రీ తోటలు, విశాలమైన వ్యూ పాయింట్లకు ఎంతో ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో పచ్చదనంతో తడిసిపోయినట్లు కనిపిస్తుంది. ఆర్థర్స్ సీట్, లింగ్మల జలపాతం పోటెత్తుతూ ఆకట్టుకుంటుంది.

⦿ ఉదయపూర్, రాజస్థాన్

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో.. రుతుపవనాల వేళ ఉదయపూర్ ఒక వైబ్. వర్షాలు కురిసే సమయంలో పిచోలా సరస్సు, ఫతే సాగర్  నిండి కనువిందు చేస్తాయి. ఆరావళి కొండలు ఆకుపచ్చగా మారి ఆహా అనిపిస్తాయి. ఉదయపూర్ కొండచరియలు విరిగిపడటం, వరదలు రావడం లాంటి పరిస్థితిలు ఉండవు. సేఫ్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.

⦿ వయనాడ్, కేరళ

కేరళ ఉత్తర కొండలలో ఉన్న వయనాడ్.. వర్షాకాలంలో దట్టమైన పొగమంచు, పచ్చదనంతో కప్పబడి ఉంటుంది. మీన్ముట్టి, సూచిపారా లాంటి జలపాతాలు అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తేయాకు తోటలు కొత్త మెరుపును సంతరించుకుంటాయి.

⦿ కూర్గ్, కర్ణాటక

కూర్గ్ ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల తోటలు మంచి వాసనను వెదజల్లుదాయి. అబ్బే జలపాతం పరవళ్లు తొక్కుతూ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి.

⦿ లోనావాలా, మహారాష్ట్ర

ముంబై-పుణే మార్గంలో ఈ ప్రాంతం ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటుంది. పొగమంచుతో కప్పబడిన రాజ్‌మాచి కోట నుంచి ఉప్పొంగుతున్న భూషి ఆనకట్ట వరకు.. ఇక్కడ ప్రతిదీ కనువిందు చేస్తుంది.

⦿ గోవా

చాలా మంది వర్షాకాలంలో గోవాకు వెళ్లడానికి ఇష్టపడరు. కానీ, పచ్చదనంతో అత్యంత అందంగా కనిపిస్తుంది. దూద్‌సాగర్ లాంటి జలపాతాలు కనువిందు చేస్తాయి.

⦿ లడఖ్, జమ్మూ & కాశ్మీర్

రుతుపవనాల సమయంలో లడఖ్ లో ఎండలు కనిపిస్తాయి.  దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ,  లడఖ్ లో వర్షాలు అంతగా ఉండవు. జూలై నుంచి సెప్టెంబర్ ప్రారంభం వరకు పాంగోంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ, లేహ్ ను పర్యాటకులు సందర్శించేందుకు ఇష్టపడుతారు.

⦿ మున్నార్, కేరళ

మున్నార్‌ లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.  వర్షం కురుస్తుంటే ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. టీ ఎస్టేట్‌ ల మెరుపులు, జలపాతాల గర్జనలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

⦿ మౌంట్ అబు, రాజస్థాన్

రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఎడారి రాష్ట్రంలో చల్లని విరామ ప్రదేశం. రుతుపవనాల వేళ నక్కీ సరస్సు పొగమంచుతో నిండి ఉంటుంది. దిల్వారా దేవాలయాలు అద్భుతంగా కనిపిస్తాయి.

⦿ షిల్లాంగ్, మేఘాలయ

రుతుపవనాల వేళ షిల్లాంగా ప్రకృతి అందాలతో వావ్ అనిపిస్తుంది. తూర్పు స్కాట్లాండ్ గా పిలిచే ఈ ప్రాంతంలో  ఉప్పొంగుతున్న జలపాతాలు, మేఘాలతో కప్పబడిన లోయలతో కనువిందు చేస్తుంది. ఎలిఫెంట్ ఫాల్స్, లైట్లమ్ కాన్యన్స్ ప్రదేశాలు మరింత ఆకట్టుకుంటాయి.

Read Also: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×