BigTV English

Kamal Hasan – Thug Life : క్లాసిక్ తో పోల్చారు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా.?

Kamal Hasan – Thug Life : క్లాసిక్ తో పోల్చారు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా.?

Kamal Hasan – Thug Life : తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలుకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆ సినిమాలను బీట్ చేయలేవు అని కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి సినిమాలలో మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా ఒకటి. ఈ సినిమాను అందరూ తెలుగు గాడ్ ఫాదర్ అని చెబుతూ ఉంటారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అద్భుతమైన గ్యాంగ్స్టర్ సినిమాలలో ఇదొక్కటే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ థగ్ లైఫ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


శింబు, నేను ఎంతో కనెక్ట్ అయ్యాం

ఒక దర్శకుడిగా మణిరత్నం గారు నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశారో.. థగ్ లైఫ్ తో కూడ ఆయన ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ద్రోణాచార్యుని కాదు. నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే మన ముందు నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి. నేను మణిరత్నం గారి సినిమాలో యాక్ట్ చేయను, జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం. సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నాజర్ గారు ఆల్రౌండర్. మేము ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాం. ఇంద్రుడు చంద్రుడు సినిమాకి తనికెళ్ల భరణి గారు రాయాల్సింది. కానీ అది కుదరలేదు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలని ఉంది. ఆయన ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను. శింబు చైల్డ్ వుడ్ నుంచి నేను తన సినిమాలు చూస్తూ ఉన్నాను. నేను కూడా చైల్డ్ యాక్టర్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. అందుకే మేము ఎంతో కనెక్ట్ అయ్యాం. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. నేను అందుకే ఒక సినిమా విద్యార్థిగానే నన్ను నేను చెప్పుకుంటాను. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది.


నాయకుడు ను మించి హిట్ అవుతుంది

థగ్ లైఫ్ మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక ఫెంటాస్టిక్స్ టీం తో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా నాయకుడు కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటినుంచి చాలా ఎక్సైట్ మెంట్ ఉంది. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. నేను తెలుగులోనే స్టార్ గా ఎదిగాను. స్టార్ గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే నా శక్తి వంచన లేకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జూన్ 5న సినిమా వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం’అన్నారు. కమల్ హాసన్ మాట్లాడిన మాటలు తర్వాత నాయకుడు సినిమాని మించి ఉంటుందా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఒకవేళ కమల్ మాటలు నిజమైనట్లయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరో క్లాసిక్ సినిమా పుట్టినట్లే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×