BigTV English
Advertisement

OTT Movie : అందరి ముందే డ్యాన్సర్ ను లేపేసి అలాంటి పని… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

OTT Movie : అందరి ముందే డ్యాన్సర్ ను లేపేసి అలాంటి పని… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

OTT Movie :  క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఉండే ఎంగేజింగ్ స్టోరీ, ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్ట్ ఇలాంటి సిరీస్ లపై ప్రత్యేకంగా ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ వచ్చే మలుపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఇలాంటి స్టోరీలు ఉన్న వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారికోసమే ఈరోజు ఓ అదిరిపోయే సిరీస్ ను మన మూవీ సజెషన్ గా తీసుకొచ్చేశాం. ఆ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.


స్టోరీలోకి వెళితే 

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒక హిందీ వెబ్ సిరీస్ గురించి. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అందేఖీ’ (Undekhi). ఈ సిరీస్ అధికారం, ధనం, అసమానతలు, న్యాయం కోసం చేసే పోరాటం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కింది. అట్వాల్ కుటుంబం చేసే దుర్మార్గపు పనుల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఇప్పటి వరకు ఇందులో మూడు సీజన్ ‌లు విడుదలయ్యాయి. 2020, 2022, 2024 … ఇలా ప్రతి రెండేళ్లకోసారి ఓ సీజన్ రిలీజ్ అయ్యి, ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సిరీస్. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లివ్ (Sonyliv) ఓటీటీలో అందుబాటులో ఉంది.


సీజన్ 1 (2020)

అట్వాల్ ఫ్యామిలీ చాలా రిచ్. వాళ్ళ వారసుడు దమన్ (అంకుర్ రాఠీ) వివాహం కోసం మనాలీలో ఒక విలాసవంతమైన వేడుకను ఏర్పాటు చేస్తారు. వేడుక సందర్భంగా, కుటుంబ పెద్ద పాపాజీ (హర్ష్ ఛాయా) ఒక డ్యాన్సర్ ను ఆగ్రహంతో చంపేస్తాడు. ఈ హత్యను రిషి (అభిషేక్ చౌహాన్) అనే ఒక అమెచ్యూర్ ఫిల్మ్‌ మేకర్ వీడియోలో రికార్డ్ చేస్తాడు. మరోవైపు అట్వాల్ కుటుంబం ఈ హత్యను దాచడానికి ఎలాంటి హద్దులనైనా దాటడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే సమయంలో DSP బరున్ ఘోష్ (దిబ్యేందు భట్టాచార్య) సుందర్‌బన్స్‌లో ఒక పోలీస్ అధికారి హత్య గురించి దర్యాప్తు చేస్తాడు. ఇందులో ఇద్దరు ఆదివాసీ బాలికలపై అనుమానం ఉంటుంది. ఇంతకీ ఆ హత్య చేసిన అట్వాల్ ఫ్యామిలీ మెంబర్ ను పట్టుకున్నారా ? పోలీస్ ఆఫీసర్ ను హత్య చేసింది ఆ ఇద్దరు అమ్మాయిలేనా? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

సీజన్ 2 (2022):

అట్వాల్ కుటుంబం తమ రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే రిషి హత్య గురించి సత్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. DSP ఘోష్ తన దర్యాప్తును కొనసాగిస్తాడు. ఈ సీజన్‌లో కొత్త పాత్రలు పరిచయం అవుతాయి. అట్వాల్ కుటుంబం లోపల అంతర్గత సంఘర్షణలు తీవ్రమవుతాయి. రింకూ (సూర్య శర్మ), తేజీ (అంచల్ సింగ్) మధ్య సంబంధం కథలో ముఖ్యమైన భాగం అవుతుంది. అట్వాల్ కుటుంబం తమ రహస్యాలను రక్షించుకోవడానికి మరింత హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది.

సీజన్ 3 (2024):

అట్వాల్ కుటుంబం చేతిలో ఉన్న అధికారం పూర్తిగా బలహీనపడుతుంది. కానీ వాళ్ళు తమ పట్టును కాపాడుకోవడానికి గట్టిగా పోరాడుతారు. DSP ఘోష్, ఇతర పాత్రలు అట్వాల్ కుటుంబాన్ని న్యాయం ముందు నిలబెట్టడానికి తమ దర్యాప్తును ముమ్మరం చేస్తారు. ఈ సీజన్‌లో రిషి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. ఆదివాసీ బాలికల కథాంశం కూడా ముగింపుకు చేరుకుంటుంది.

Read Also : అమ్మాయితో ఆ పని చేస్తూ మధ్యలోనే పరలోకానికి… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×