Kamal Hassan: సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)ఇటీవల పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.. ఇలా తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యలు కన్నడనాట తీవ్ర సంచలనాలను సృష్టించడమే కాకుండా అక్కడ కమల్ హాసన్ సినిమాకు పెద్ద ఎత్తున ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్(Thugh Life) సినిమాని అడ్డుకుంటామంటూ అక్కడ వివాదం చెలరేగడం ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా కమల్ హాసన్ తానేమి తప్పు మాట్లాడలేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని తెలిపారు.
హిందీ భాష..
ఇలా కన్నడ భాష వివాదం నెలకొన్న నేపథ్యంలో కమల్ హాసన్ దక్షిణాది రాష్ట్రాలపై హిందీ(Hindi Language) భాషను రుద్దుతున్నారని అంశం గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను ఏక్ దుజే కే లియే అనే సినిమాలో నటించాననీ అప్పట్లో ఒక మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాల తమిళ కుర్రాడు తన పొరుగు వారితో హిందీ మాట్లాడే విధానాన్ని కమల్ హాసన్ పిటీఐ కి తెలిపారు. ఏదైనా ఒక భాషను నేర్చుకున్నప్పుడు ఆ భాష గురించి ఇంపోజిషన్ ఇవ్వడం సరైనది కాదని తెలిపారు. ఇలా ఒక భాషను నేర్చుకోవడానికి ఇంపోజిషన్ ఇవ్వడం కాకుండా చాలా సులభంగా ఆ భాషను నేర్చుకునే మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.
బలవంతం చేయొద్దు…
ఇక ఇటీవల తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న అంశాన్ని గురించి కూడా కమల్ హాసన్ ప్రస్తావించారు. ఒక భాషను బలవంతంగా నేర్చుకోవాలని చెప్పటం వల్ల ఆ భాషను నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విషయంలో తాను కర్ణాటక ఆంధ్రకు మద్దతుగా నిలబడతానని కమల్ హాసన్ తెలిపారు. కేవలం హిందీ అని మాత్రమే కాదు ఇంగ్లీష్, స్పానిష్ చైనీస్ వంటి భాషలను కూడా నేర్చుకోవాలి కానీ బలవంతంగా కాదని తెలిపారు. ఉన్నఫలంగా ఒక భాషను నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల ఎంతో ఇబ్బంది పడతారు. తమిళనాడులోని ఎంతో మంది నిరక్షరాస్యులు ఉన్నారు.
ఇలా తమిళనాడులో కచ్చితంగా మీరు హిందీ నేర్చుకోవాలని హిందీ నేర్చుకోకపోతే ఉద్యోగాలు లభించవని చెబితే ఎలా? ఇలా చెప్పటం వల్ల భవిష్యత్తులో నా అధికారిక భాష ఏది అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతుంటాయని కమల్ హాసన్ తెలిపారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలలో హిందీ భాష అమలు విధానం గురించి కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. భాష నేర్చుకోవటం అవసరమే కానీ బలవంతంగా నేర్చుకోమని చెప్పడం సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక భాషను బలవంతంగా కాకుండా చాలా సులభంగా నేర్చుకొని మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విడుదల ముందు కన్నడ తమిళ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ వివాదం కారణంగా కన్నడలో ఈ సినిమాకు పూర్తిస్థాయిలో నెగెటివిటీ ఏర్పడడం జరిగింది. అయినా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ మాత్రం పొందలేకపోయింది.