BigTV English

Rinku Singh Engagement: ఎంపీతోనే రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. కట్నం ఎంతంటే ?

Rinku Singh Engagement: ఎంపీతోనే రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. కట్నం ఎంతంటే ?

Rinku Singh Engagement:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తి కాగానే… టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి… పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాలో చాలామంది యంగ్ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో పెళ్లి కాని వారు ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్… ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో… ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కుల్దీప్ యాదవ్. అందుకే ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.


Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

గ్రాండ్ గా రింకూ సింగ్ , సరోజ్ ఎంగేజ్మెంట్


టీమిండియా స్టార్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరో టీమిండియా స్టార్ ఆటగాడు పెళ్లికి సిద్ధమయ్యాడు. అతను ఎవరో కాదు టీమ్ ఇండియా డేంజర్ ఆటగాడు రింకూ సింగ్. అతి త్వరలోనే ఎంపీని రింకు సింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడని మొన్నటి నుంచి వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఇవాళ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నాడు టీమిండియా స్టార్ ఆటగాడు రింకు సింగ్. అది కూడా పార్లమెంటు సభ్యురాలు అయిన ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఫినిష్ చేశాడు రింకు సింగ్.

టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ అలాగే సమాజ వాది పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ ఇవాళ మధ్యాహ్నం చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రింకూ సింగ్ అలాగే ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించారు. దాదాపు 300 మంది అతిథుల సమక్షంలోనే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది.

ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసిన రింకు సింగ్

ఇవాళ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ట్రెడిషనల్ డ్రెస్సులో రింకు సింగ్ అలాగే ప్రియా సరోజ్ ఇద్దరు కనిపించారు. 300 మంది సమక్షంలోనే ఈ ఇద్దరు రింగులు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవాళ ఎంగేజ్మెంట్ కాగా నవంబర్ 18వ తేదీ వారణాసిలో రింకు సింగ్ పెళ్లి జరగబోతుందని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కట్నం ఎంత అంటే ?

రింకు సింగ్ కు… భారీగానే సమాజవాది పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రియా సరోజ్ కుటుంబం కట్నం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఖరీదైన ఫ్లాట్ తో పాటు బంగారం అలాగే డబ్బులు కూడా ఇస్తున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మచిలీషాహర్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రియా.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×