Kangana ranaut.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana ranaut)కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్స్ సర్జరీపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ తమను తాము తెరపై అందంగా చూపించుకోవడానికి.. శస్త్ర చికిత్సలను ఆశ్రయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముక్కు, పెదవులు, ముఖం లేదా శరీరం లోని ఇతర భాగాలు అందవిహీనంగా ఉంటే వాటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చికిత్సలు వికటించి, వికృత రూపానికి మారిపోయిన వారు కూడా ఉన్నారు. చికిత్సతో అందాన్ని పెంచుకున్న హీరోయిన్స్.. డజన్ల కొద్దీ ఉన్నారు. వారంతా కూడా పలు సందర్భాలలో మీడియా ముందే తమకు జరిగిన శస్త్ర చికిత్సల గురించి ఓపెన్ అయ్యారు.
హీరోయిన్స్ అందంగా కనిపించడానికి అలా చేస్తారు.. కంగనా
అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా మాట్లాడుతూ.. అందం కోసం శస్త్ర చికిత్సలకు సిద్ధం అయ్యే నటీమణుల గురించి తెలిపిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. కొందరు ఫేక్ ఐల్యాష్, బొటాక్స్ తో వృద్ధాప్యం రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఆ కేటగిరీకి చెందిన దాన్ని కాదు అంటూ కామెంట్లు చేయడంతో దీనిపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు నిజంగానే హీరోయిన్స్ వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఇలా చేస్తున్నారా? అంటూ మరొకసారి ఇంటర్నెట్లో చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రలే వారికి దర్శకులు ఆఫర్ చేస్తారని కంగనా విమర్శలు గుప్పించింది.’పద్మావత్’ సినిమాలో మొదట తనకే ప్రధాన పాత్రలో ఆఫర్ ఇచ్చారని, కానీ స్క్రిప్ట్ అడిగితే ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ సినిమా చేయలేదని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి మాట్లాడుతూ.. పేరు పెట్టకుండానే వేశ్యల కథలు, పాత్రలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసిన దర్శకుడు భన్సాలీ అంటూ మరొకసారి తెలిపింది. మొత్తానికి అయితే పద్మావత్ గురించి మాట్లాడడం చర్చకు వచ్చింది. స్క్రిప్ట్ ఇవ్వరు, కనీసం పాత్ర ఏంటి అన్నది చెప్పరు అని కూడా కామెంట్లు చేస్తూ.. బాలీవుడ్ దిగ్గజ దర్శకలైన భన్సాలీ అని టార్గెట్ చేసింది కంగనా రనౌత్. మొత్తానికి అయితే హీరోయిన్స్ విషయంపై ఇటు దర్శకులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రాజకీయాల్లో కూడా బిజీగా మారిన కంగనా..
ఇకపోతే కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు లేడి ఓరియంటెడ్ గా తాను చేసే చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తూ ఉంటుంది. అలా ఎమర్జెన్సీ సినిమాలో కూడా తానే నటించి దర్శకత్వం వహించిన విషయం తెలిసింది. ఇక ఈ సినిమాను రిలీజ్ చేయించడానికి ఎన్ని తిప్పలు పడిందో అందరికీ కూడా తెలుసు. మరొకవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న ఈమె మండి ప్రాంతానికి ఎంపీగా ఎన్నికయింది. ప్రస్తుతం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది కంగనా రనౌత్.