Kangana Ranaut:లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజుల కుటుంబానికి చెందిన ఈమె సినిమాలలోకి రావడానికి, కుటుంబాన్ని సైతం కాదనుకొని ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక్కడ తన టాలెంట్ తో తనను తాను నిరూపించుకొని, స్ట్రాంగ్ ఉమెన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమయం సందర్భం ఏదైనా సరే స్టాండ్ తీసుకొని ప్రశ్నించగల సామర్థ్యం ఉన్న హీరోయిన్ అని చెప్పవచ్చు. అంతేకాదు అలా ప్రశ్నిస్తూ అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ లో వర్మ (RGV) ఎలా అయితే కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారో.. నార్త్ లో కంగనా రనౌత్ కూడా కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇక సినిమాలలోనే కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతోంది ఈ ముద్దుగుమ్మ.
‘ఎమర్జెన్సీ’ దెబ్బకు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన కంగనా..
బీజేపీ పార్టీలో చేరిన కంగనా రనౌత్ ‘మండి’ప్రాంతానికి ఎంపీగా గెలిచి, అక్కడ బాధ్యతలు చేపట్టింది. ఇదిలా ఉండగా చివరిగా కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషించింది. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆమె వహించడం గమనార్హం. ఇక ఇందులో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) , అటల్ బిహారీ వాజ్పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే నటించారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, మరెన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17వ తేదీన విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే మరికొన్నిచోట్ల పూర్తి డిజాస్టర్ ను చవిచూసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాస్త సినిమాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు, అందులో భాగంగానే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
ఫుడ్ కేఫ్ ప్రారంభించనున్న కంగనా..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కంగనా రనౌత్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఫుడ్ బిజినెస్ మొదలు పెడుతున్నానంటూ ఇటీవల ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టిన ఈమె, దానిని సహకారం చేసుకుంది.’ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో హిమాలయాలలో కేఫ్ ఏర్పాటు చేసింది కంగనా. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ కేఫ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రెస్టారెంట్ ఫోటోలను నెటిజనులతో పంచుకుంది. సాంప్రదాయ హిమాచల్ ఫుడ్డును మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే దీని లక్ష్యంగా ఏర్పాటు చేశానని కంగనా చెప్పుకొచ్చింది.
నా చిన్ననాటి కల నెరవేరింది..
ఈ మేరకు ఒక నోట్ వదిలింది కంగనా. అందులో “నా చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుంది. హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్ ‘ది మౌంటైన్ స్టోరీ’ .. ఇదొక ప్రేమ కథ” అంటూ ఆమె తెలిపింది. ఫుడ్ బిజినెస్ లో ఇప్పటికే పలువురు తారలు మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కంగనా కూడా చేరిపోయింది.
మరి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన కంగనా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.