BigTV English

Kannappa Direction: ఏంటీ కన్నప్ప సినిమాకు విష్ణు డైరెక్టరా.. ఆ సీన్లన్నీ చేశారా?

Kannappa Direction: ఏంటీ కన్నప్ప సినిమాకు విష్ణు డైరెక్టరా.. ఆ సీన్లన్నీ చేశారా?

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా(Kannappa Movie) పాన్ ఇండియా స్థాయిలో జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప గురించి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే కథతో ఇదివరకు భక్తకన్నప్ప వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. మంచు విష్ణు మరోసారి అద్భుతమైన గ్రాఫిక్స్ లతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను భారీగా నిర్వహిస్తున్నారు.


మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ , మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారందరూ కూడా భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ బాబు(Mohan Babu) నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచి విష్ణు కన్నప్ప సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేషాల గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

దర్శకుడిగా మారిన విష్ణు…


ఈ సినిమాలు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలిపారు. ఒక యాక్షన్ సీన్ ఏకంగా 18 నిమిషాల పాటు ఉందని దానిని ట్రిమ్ చేస్తూ 12 నిమిషాలకు తీసుకువచ్చామని తెలిపారు. ఇంతకన్నా ఇంకా కుదించి ఈ యాక్షన్ ఎపిసోడ్ పెట్టాలని ప్రయత్నం చేసిన అది కుదరలేదని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో చూస్తారని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించాను అంటూ మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా మంచు విష్ణు ఈ సినిమా కోసం దర్శకుడిగా మారిపోయారనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రుద్ర పాత్ర హైలెట్…

ఇక మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయో చెప్పండి అన్న ఆ టైంలో మేము నిద్రపోతాము అంటూ కొందరు విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమైన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రుద్ర (Rudra)పాత్రలో నటించడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ చివరి కొన్ని సెకండ్లు కనిపించిన తన లుక్ మాత్రం అందరిని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో దాదాపు 30 నిమిషాల పాటు తెరపై కనిపించి సందడి చేయబోతున్నట్లు విష్ణు తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×