Tholiprema Re Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (Re Release)సినిమాల ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు మరోసారి వెండి తెరపై విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాలను తిరిగి థియేటర్లో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న మరోవైపు రీ రిలీజ్ సినిమాలు కూడా కొత్త సినిమాలకు పోటీగా విడుదలవుతున్నాయి.
నిరాశలో పవన అభిమానులు…
ఇకపోతే జూన్ 12వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక త్వరలోనే కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.. పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు సోలో హీరోగా వెండి తెరపై చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇలాంటి తరుణంలోనే హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుందని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడిందని తెలియగానే అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు.
తొలిప్రేమ రీ రిలీజ్..
ఇలా వీరమల్లు సినిమా వాయిదా పడటంతో నిరాశలో ఉన్న అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, అలాంటి వాటిలో తొలిప్రేమ (Tholiprema)సినిమా ఒకటి. అయితే ఈ సినిమా త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి (Keerthi Reddy)ప్రధాన పాత్రలలో, ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1998 జూలై 24 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.ఎస్.సి ఆర్ట్స్ బ్యానర్ పై జీవిజీ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో వాసుకీ, అలీ, వేణుమాధవ్, సంగీత వంటి తదితరులు నటించారు.
ఇలా పవన్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా జూలై 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు తిరిగి రాబోతుంది. ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు సినిమా వస్తుందని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఆ సినిమా విడుదల కాకపోయిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మరోసారి వెండి తెరపై చూసే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో(OG Movie) పాటు, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh)అనే సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే.