Jaat OTT Review : ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు హిట్ అయ్యేవి. కానీ ఈ మధ్య తెలుగు సినిమాలు హిందీలో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. మన తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుతున్నాయి. తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోలతో సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది యానిమల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ సినిమాతో పాటుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు.. ఇటీవల తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జాట్.. బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ మూవీ ఇదే. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఓటీటీల్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది..
స్టోరీ విషయానికొస్తే..
జాట్ మూవీ లో సన్నీ డియోల్ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకేక్కించిన లేటెస్ట్ చిత్రం జాట్.. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. రణతుంగ, అతని బ్రదర్ శ్రీలంక నుంచి భారీ నిధి దోచుకుని పారిపోయి భారత్ కు వస్తారు. ఏపీలోని మోటుపల్లిని స్థావరంగా చేసుకుని అక్రమాలకు తెరతీస్తారు. చుట్టుపక్కల గ్రామాలనూ గుప్పిట్లో ఉంచుకుని నియంతలా పాలిస్తూ ప్రజలను కనుసైగలతో భయపెట్టేవాడు. మరోవైపు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ వెళ్లున్న రైలు మోటుపల్లి సమీపంలో ఆగిపోతుంది. దగ్గర్లో ఉన్న ఓ హోటల్లో హీరో టిఫిన్ చేస్తుండగా.. రౌడీలు గొడవ చేస్తారు.. ఆ గొడవలో తాను చేస్తున్న ఇడ్లీలు కింద పడిపోతాయి. దాంతో కోపంతో రౌడీల తుక్కు రేగోడతాడు.. ఆ గొడవ కాస్త ఆ ఊరి నియంత దగ్గరకు వెళ్తుంది. అలా హీరో, విలన్ మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. విలన్లను ఎలా ఎదురించాడన్నదే కథ. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన మూవీగా నిలిచింది.
Also Read : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా..డోంట్ మిస్
నెట్ ఫ్లిక్స్ ( netflix )..
బాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జాట్ మూవీ ఏప్రిల్ 11 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం దుమ్ముదులిపేసింది.. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్ గా రూ.120 కోట్లు వసూల్ చేసింది.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. జూన్ 5 న ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది.. యాక్షన్ సినిమా చూడాలనుకొనేవారు ఈ మూవీని చూసేయ్యండి.