Kannappa Hard Disc :తాజాగా కోకాపేటకు చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్.. తమ ఆఫీస్ బాయ్ రఘు, కన్నప్ప సినిమా స్టోరీ ఉన్న హార్డ్ డ్రైవ్ ను తీసుకెళ్లి చరిత అనే మహిళకు ఇచ్చి అప్పటినుంచి ఇద్దరు కనిపించడం లేదని, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా.. ఇప్పుడు వీళ్ళదే కీలక పాత్ర అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈనెల 25వ తేదీన ముంబై హెచ్ఐవీఈ స్టూడియోస్ డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాదులో ఉన్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ స్టూడియోకి హార్డ్ డిస్క్ ను పంపించారు. అయితే ఈ హార్డ్ డిస్క్ ను అదే ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్న రఘు తీసుకొని, మహిళా ఉద్యోగి చరితకి హ్యాండ్ ఓవర్ చేశారు. పార్సిల్ తీసుకున్న చరిత, ఆ పార్సిల్ ను ఆమెకు అందించిన రఘు ఇద్దరు కూడా ఆ రోజు నుంచి కనిపించలేదంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ హార్డ్ డిస్క్లో 1 గంట 30 నిమిషాల సినిమా ఉందని ఫిర్యాదు చేశారు. అయితే గత కొంతసేపటి క్రితం వీరిద్దరిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చిన అందులో నిజం లేదని..ప్రస్తుతం చరిత అనే ఉద్యోగి అందుబాటులో లేదని సమాచారం. కేసు నమోదు చేసుకున్న ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా ఈ హార్డ్ డిస్క్ దొంగతనంలో వీరిద్దరిదే పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది.
కన్నప్ప కష్టాన్ని దోచుకున్న దుండగులు..
ముఖ్యంగా మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మంచు విష్ణు లాంటి భారీ తారాగణంతో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడి సినిమాను తెరకెక్కించారు. ఇక జూన్ 27వ తేదీన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో..3:10 గంటల నిడివి ఉన్న సినిమా నుండి 1:30 గంటల నిడివి ఉన్న హార్డ్ డిస్క్ ను దొంగతనం చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప కష్టాన్ని దుండగులు దోచుకోవడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు మంచు విష్ణు కి జరిగిన నష్టాన్ని చూసి మంచు విష్ణు పై ఇప్పుడు సింపథీ కూడా పెరుగుతోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ హార్డ్ డిస్క్ దొంగతనంలో ఇద్దరి హస్తం ప్రధమంగా వినిపిస్తోంది. మరి వీరి వెనుక ఎవరు ఉన్నారు..? ఏ ఉద్దేశంతో దొంగతనం చేశారు అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.
కన్నప్ప సినిమా విశేషాలు:
కన్నప్ప సినిమా విషయానికొస్తే.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారానే మంచు విష్ణు కూతురులిద్దరూ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక అలాగే ప్రభాస్ ఇందులో 30 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించబోతున్నారట. అంతేకాదు ఆ స్క్రీన్ స్పేస్ సినిమా కథను మలుపు తిప్పుతుంది అని, మోహన్ లాల్ 15 నిమిషాల పాటు కనిపించనున్నారు అని మంచు విష్ణు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపారు.
ALSO READ :Samantha Dress : సైడ్ నుంచి.. మొత్తం చూపించేసింది.. సమంత ఇలాంటి డ్రెస్‌లు వేయడం ఏంటి?