BigTV English

Manchu Vishnu: ఒకవైపు హార్డ్ డిస్క్ కాంట్రవర్సీ నడుస్తుంటే, మరోవైపు ఈ ఫోటోలుకు ఫోజులు ఏంటి మా ప్రెసిడెంట్ గారు

Manchu Vishnu: ఒకవైపు హార్డ్ డిస్క్ కాంట్రవర్సీ నడుస్తుంటే, మరోవైపు ఈ ఫోటోలుకు ఫోజులు ఏంటి మా ప్రెసిడెంట్ గారు

Manchu Vishnu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా మంచి పేరు సాధించుకున్నారు మోహన్ బాబు. ఆ తర్వాత కాలంలో నాసిరకం సినిమాలు చేసి వాళ్లు నటించే సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గేలా చేశారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే థియేటర్ దగ్గరకు జనాలు వెళ్ళే సాహసం కూడా చేయరు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్ లో కొంతమంది ప్రముఖులు మినహాయిస్తే నార్మల్ ఆడియన్స్ థియేటర్ కు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ కన్నప్ప అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో నటిస్తుండటం.


హార్డ్ డిస్క్ పోయింది 

ఈ సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ పోయినట్లు ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 శాతం సినిమా ఈ హార్డ్ డిస్క్ లో ఉండిపోయినట్లు తెలుస్తోంది. అలానే దీనిపై పలు రకాల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అనే ఫైట్ కూడా నడుస్తుంది. ఈ తరుణంలో తండ్రి మోహన్ బాబుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు విష్ణు. శ్రీ బాబా జ్యోతి లింగాన్ని దర్శించుకున్నట్లు తన తండ్రితో పాటు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ పూజలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి.


మనోజ్ కు వార్నింగ్ ఇచ్చాడా.?

మంచు మనోజ్ భైరవం సినిమా ఈవెంట్లో శివయ్య అంటూ డైలాగ్ చెప్పి కొన్ని మాటలు మాట్లాడిన విషయం విధితమే. ఆ తర్వాత సినిమా అంటే ఒక వ్యక్తిది మాత్రమే కాదు అని తెలిసి ఆ చిత్ర యూనిట్ అంతటికి క్షమాపణలు తెలియజేశాడు. ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకున్నాడు. అలానే తను తన నాన్నగారితో కలిసి ఉండటం చాలా మందికి నచ్చక పోవడం వలనే గొడవలు మొదలయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు. మోహన్ బాబుని మనోజ్ ఎంతలా గౌరవిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాన్న నా వైపు ఉన్నారు అని మనోజ్ కి తెలిసేలా విష్ణు ఫోటోలు షేర్ చేశాడా అనే కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×