BigTV English

TDP Mahanadu 2025: గోంగూర చికెన్, ఫూల్ మఖానా.. మహానాడు మెనూ అదుర్స్.. 5 లక్షల మందికి పసందైన విందు..

TDP Mahanadu 2025: గోంగూర చికెన్, ఫూల్ మఖానా.. మహానాడు మెనూ అదుర్స్.. 5 లక్షల మందికి పసందైన విందు..

TDP Mahanadu 2025: కడప నడిబొడ్డున పసుపు పండగ మొదలైంది. మూడు రోజులపాటు టీడీపీ 43వ మహానాడు జరుగబోతోంది. మే 27 నుంచి 29 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలిసారిగా కడపలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఒకే చోట చేరి భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు, రాజకీయ వ్యూహాలు చర్చించుకునే ఒక వార్షిక మహాసభ.


పచ్చని జెండాలతో ప్రతి గడప పచ్చదనం పులుముకుంది. పచ్చని తోరణాలు అలంకరించి వేదికలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల భారీ గెలుపు తర్వాత టీడీపీ ఏర్పాటు చేసిన తొలి మహానాడు. దాదాపు ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

కడపలో 140 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంగణంలో సిద్ధం చేసింది. మహానాడు వేదికపై 450 మంది ప్రముఖులు కూర్చునేలా మహానాడు చరిత్రలో.. తొలిసారిగా బాహుబలి వేదికను కడప గడ్డపై సిద్దం చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేకమైన వంటకాల రుచిని చూపిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మహనాడులో నాన్ వెజ్ కూడా పెట్టనున్నారు. ఫస్ట్ రెండు రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో సుమారు ఐదు లక్షల మందికి ఆహారం అందిస్తూనే.. వెలుపుల చుట్టుప్రక్కల ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు.


ప్రతిరోజు భోజనాల్లో దాదాపు 20 రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారు. 1700 మంది వంటవండేవారు, మరో 800 మందిని వడ్డించేందుకు వినియోగిస్తున్నారు. ఇందులో స్పెషల్ స్వీట్స్ కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్స్ హల్వా, మిఠాయిలు వంటి పలు రకాల స్వీట్స్ సిద్ధం చేస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో వంటకాలను బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మహానాడులో మధ్యాహ్నం భోజనాలు అద్బుతంగా ఏర్పాటు చేశారు. వెజ్, నాన్ వెజ్ వేర్వేరుగా స్టాల్స్ ఉన్నాయి. మొత్తం 15 రకాల వంటకాలు పెట్టారు. భోజనాలు బాగున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పెళ్లి భోజనాలు కంటే అద్బుతంగా ఉన్నాయని చెబుతున్నారు. గతం కంటే గొప్పగా మహానాడు నిర్వహిస్తున్నారని అంటున్నారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం
టూటీఫ్రూటీ కేసరి, చక్కెర పొంగలి, ఇడ్లీ, టమోటా బాత్, కాఫీ, టీ మొదలైనవి.

మధ్యాహ్న భోజనం..
నాన్ వెజ్ ప్రియులకు.. గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటీ పచ్చడి, వైట్ రైస్, సాంబారు, బిర్యానీ, మాంగో పికెల్, పెరుగు, ఉలవచారు.

శాఖాహారులకు.. గోంగూర పూల్ మఖానా, వెజ్ బిర్యానీ, టమోటా పప్పు, వైట్ రైస్, రోటి పచ్చడి, చిప్స్, ములక్కాయ కర్రీ, బెండకాయ బూందీ ఫ్రై..

సాయంత్రం స్నాక్స్
కాఫీ, టీ, కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు

Also Read: సీమలో సెగ పుట్టేలా.. టీడీపీ మహానాడు

రాత్రి భోజనాలు..
వైట్ రైస్‌తో పాటు వంకాయ బఠాణీ కర్రీ, పొటాటో ఫ్రై, సాంబార్, రోటి పచ్చడి, పెరుగు

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×