Big Stories

PM Modi: ఈడీ అరెస్ట్ చేసింది.. కేవలం 3 శాతం మంది రాజకీయ నాయకులనే: మోదీ

PM Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై వస్తున్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. రాజకీయ పార్టీలకు వచ్చే డబ్బు ఎంతో తెలుసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఎంతగానే ఉపయోగపడ్డాయన్నారు.

- Advertisement -

ఎలక్టోరల్ బాండ్స్ ను తీసుకురావడంతో ఏ పార్టీకి ఎంతెంత డబ్బు అందిందో తెలుసుకోవడం సులభంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర తన చెప్పుచేతల్లో ఉంచుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై వాటిని సంధిస్తోందని విమర్శలు వస్తున్నందున మోదీ వాటిపై కూడా స్పందించారు.

- Advertisement -

గత కొన్ని నెలలుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి ఇంటికి తెల్లవారేసరికి.. ఈడీ, సీబీఐలు వెళ్లి భయపెడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన మోదీ.. ఈడీ ఎవరని టార్గెట్ చేయడం లేదని, దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు.

ఇప్పటికి వరకు ఈడీ అరెస్ట్ చేసిన వారిలో కేవలం.. 3 శాతం మంది మాత్రమే రాజకీయ నాయకులు ఉన్నారని మోదీ అన్నారు. మిగిలిన 97 శాతం మంది వ్యాపారవేత్తలు, అధికారులేనని మోదీ ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో పనిచేసిన మాదిరిగానే ప్రస్తుతం ఈడీ పనిచేస్తోందన్నారు.

Also Read: ECI Says 4650 crore seized: ఈసీ ప్రకటన.. డ్రగ్స్‌దే అగ్రస్థానం, ఏపీలో 125 కోట్లు

ఈడీ పలువురుపై కేసులు పెట్టడమే కాదని.. లక్షల కోట్లను సీజ్ చేస్తోందని గుర్తు చేశారు. అక్రమ సంపాదనను మాత్రమే ఈడీ వెలికితీస్తోందని.. సామాన్య ప్రజలను ఎవ్వరినీ ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో మోదీ.. ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్న వాటిపై కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News